Breaking News

బీసీసీఐ చైర్మెన్‌గా రాజీవ్ శుక్లా..?

Published on Sun, 06/01/2025 - 10:04

భార‌త క్రికెట్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది జూలైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చెర్మైన్ ప‌ద‌వి నుంచి రోజర్ బిన్నీ త‌ప్పుకోనున్న‌ట్లు తెలుస్తోంది.  బీసీసీఐ రూల్స్ ప్ర‌కారం.. 70 ఏళ్ల నిండిన త‌ర్వాత ఆఫీసు బేరర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది జూలై 19తో బిన్నీ70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ క్ర‌మంలో రోజ‌ర్ త‌నంతట తానే అధ్య‌క్షుడి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు బీసీసీఐ వర్గాలు క్రిక్‌బ్లాగర్‌కు తెలిపాయి. అత‌ని స్దానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న‌ రాజీవ్ శుక్లా బోర్డు తాత్కాలిక చైర్మెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు క్రిక్‌బ్లాగర్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. 

ఈ విష‌యంపై  బోర్డులో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నట్లు స‌మాచారం. 1983 వ‌ర‌ల్డ్‌క‌ప్ విజేతైన రోజ‌ర్ బిన్నీ.. 2022లో గంగూలీ స్ధానంలో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న దాదాపు మూడేళ్ల పాటు ఈ ప‌దవిలో కొన‌సాగారు. ఇక రాజీవ్ శుక్లా చాలా ఏళ్ల నుంచి భార‌త క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు.  ఉపాధ్యక్షుడిగా ఉన్న‌ రాజీవ్ శుక్లా గ‌తంలో ఐపీఎల్ చైర్మెన్‌గా కూడా పనిచేశారు. త్వరలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో శు​‍క్లా ఎంపికను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
చదవండి: IPL 2025 Qualifier 2: పంజాబ్‌కు గుడ్‌ న్యూస్‌.. ముంబైకి బ్యాడ్‌ న్యూస్‌?
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)