Breaking News

కోహ్లి, డివిలియర్స్‌ ఫోన్లు.. పోలీసులను ఆశ్రయించిన ఆర్సీబీ కెప్టెన్‌ పాటిదార్‌

Published on Sun, 08/10/2025 - 12:14

ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఓ విచిత్రమైన సమస్యను ఎదుర్కొన్నాడు. అతను మూడు నెలలుగా వాడని ఓ ఫోన్‌ నంబర్‌ను ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన మనీశ్‌ అనే కుర్రాడికి కేటాయించారు (ఆపరేటర్‌).

మనీశ్‌ సిమ్‌ యాక్టివేట్‌ చేసుకోగానే వాట్సప్‌ డీపీపై రజత్‌ పాటిదార్‌ ఫోటో వచ్చింది. అనంతరం అతనికి టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి, సౌతాఫ్రికా మాజీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌, మరికొంత మంది ఆర్సీబీ ఆటగాళ్ల నుంచి ఫోన్లు వచ్చాయి.

స్టార్‌ క్రికెటర్ల నుంచి ఫోన్లు రావడాన్ని ప్రాంక్‌ అనుకున్న మనీశ్‌.. వారికి అదే రీతిలో సమాధానం చెప్పాడట. నేను కోహ్లిని మాట్లాడుతన్నాను అంటే నేను టెండూల్కర్‌ని చెప్పు అని ఆ కుర్రాడు సమాధానం చెప్పాడట. ఏబీడీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట.

చిన్నగా విషయం పాటిదార్‌కు తెలియడంతో అతను మనీశ్‌ను సంప్రదించాడు. సిమ్‌ కార్డును తిరిగి ఇచ్చేయమని అడిగాడు. ఇది ‍కూడా ప్రాంకే అని భావించిన ఆ యువకుడు నేను ధోనిని అంటూ పాటిదార్‌ మాటను దాటవేశాడట. మనీశ్‌కు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పాటిదార్‌ చివరికి పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసుల రంగప్రవేశంలో మనీశ్‌ విషయాన్ని గ్రహించి సిమ్‌ను పాటిదార్‌కు తిరిగి ఇచ్చేశాడు. తాను నిజంగానే కోహ్లితో మాట్లాడానని తెలిసి మనీశ్‌ ఉబ్బితబ్బిబవుతున్నాడు. కోహ్లీతో మాట్లాడాను, నమ్మలేకపోతున్నాను అంటూ ఓ టీవీ ఛానెల్‌తో చెప్పాడు.

కోహ్లి కల నెరవేర్చిన పాటిదార్‌
పాటిదార్‌ ఐపీఎల్‌లో కోహ్లి 18 ఏళ్ల కలను నెరవేర్చాడు. ఈ ఏడాదే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాటిదార్‌ ఆర్సీబీకి అందని ద్రాక్షగా ఉండిన ఐపీఎల్‌ టైటిల్‌ను అందించాడు. పాటిదార్‌ త్వరలో ప్రారంభం కాబోయే దులీప్‌ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)