Breaking News

IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్‌ పాటిదార్‌.. అధికారిక ప్రకటన

Published on Thu, 02/13/2025 - 12:31

ఐపీఎల్‌ 2025 (IPL) సీజన్‌ కోసం​ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) నూతన కెప్టెన్‌ను ప్రకటించింది. వచ్చే సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారికంగా వెల్లడించింది. 31 ఏళ్ల పాటిదార్‌ గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్‌గా వ్యవహిరిస్తున్నాడు. 

తొలుత ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి మళ్లీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమంతా ఊహాగానాలే అని తేలిపోయింది. విరాట్‌కు కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేకనే పాటిదార్‌ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పాటిదార్‌.. గత సీజన్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. 

పాటిదార్‌కు రంజీల్లో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. పాటిదార్‌ కొన్ని సందర్భాల్లో ఆర్సీబీ కెప్టెన్‌గానూ (తాత్కాలిక) వ్యవహరించాడు. తాజా పరిణామంతో పాటిదార్‌ ఆర్సీబీ ఎనిమిదో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో రాహుల్‌ ద్రవిడ్‌ (2008), కెవిన్‌ పీటర్సన్‌ (2009), అనిల్‌ కుంబ్లే (2009), డేనియల్‌ వెటోరీ (2011), విరాట్‌ కోహ్లి (2011), షేన్‌ వాట్సన్‌ (2017), ఫాప్‌ డుప్లెసిస్‌ (2022) ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు.

2022 నుంచి 2024 వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్‌ డుప్లెసిస్‌ను మెగా వేలంలో తిరిగి రీటైన్‌ చేసుకోకపోవడంతో 2025 సీజన్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్‌ లేకుండా ఉండింది.  

2021లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన పాటిదార్‌ అప్పటినుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పాటిదార్‌.. తనదైన శైలిలో విధ్వంసం సృష్టించి ఆర్సీబీ మిడిలార్డర్‌లో డ్యాషింగ్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాటిదార్‌.. స్పిన్‌ మరియు పేస్‌ బౌలింగ్‌ను సమర్దవంతంగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్‌ 158.85 స్ట్రయిక్‌రేట్‌తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీలు ఉన్నాయి.

పాటిదార్‌ను ఇటీవల ముగిసిన మెగా వేలానికి ముందు ఆర్సీబీ రూ. 11 కోట్లు పెట్టి రీటైన్‌ చేసుకుంది. ఆర్సీబీ రీటైన్‌ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో పాటిదార్‌ ఒకడు. పాటిదార్‌ కాకుండా ఆర్సీబీ విరాట్‌ కోహ్లి, యశ్‌ దయాల్‌ను రీటైన్‌ చేసుకుంది.

కాగా, ఐపీఎల్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ కూడా సాధించని విషయం తెలిసిందే. 2009, 2011, 2016లో రన్నకప్‌గా నిలిచిన ఈ జట్టు.. 2015, 2020, 2021, 2022, 2024 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరింది. 
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)