Breaking News

రెచ్చిపోయిన రజత్ పాటిదార్‌.. ఫైనల్లో మధ్యప్రదేశ్‌

Published on Fri, 12/13/2024 - 20:14

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో మధ్యప్రదేశ్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ (డిసెంబర్‌ 13) సాయంత్రం జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్‌ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. 

అనుజ్‌ రావత్‌ (33 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ప్రియాన్ష్‌ ఆర్య 29, యశ్‌ ధుల్‌ 11, ఆయుశ్‌ బదోని 19, హిమ్మత్‌ సింగ్‌ 15, మయాంక్‌ రావత్‌ 24, హర్ష్‌ త్యాగి 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో వెంకటేశ్‌ అయ్యర్‌ 2, కుమార్‌ కార్తికేయ, ఆవేశ్‌ ఖాన్‌, త్రిపురేశ్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

రెచ్చిపోయిన రజత్ పాటిదార్‌
147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌.. రజత్‌ పాటిదార్‌ రెచ్చిపోవడంతో 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రజత్‌ పాటిదార్‌ 29 బంతుల్లో 4 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

పాటిదార్‌కు హర్ప్రీత్‌ సింగ్‌ భాటియా (46 నాటౌట్‌) సహకరించాడు. ఆదిలో ఓపెనర్‌ హర్ష్‌ గావ్లి (30) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హిమాన్షు చౌహాన్‌ ఓ వికెట్‌ తీశాడు.

ఫైనల్లో మధ్యప్రదేశ్‌
ఢిల్లీపై గెలుపుతో మధ్యప్రదేశ్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. డిసెంబర్‌ 15న జరిగే ఫైనల్లో మధ్యప్రదేశ్‌ ముంబైని ఢీకొంటుంది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బరోడాపై గెలిచి ముంబై ఫైనల్‌కు చేరింది. రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)