Breaking News

ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్పందించిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌

Published on Tue, 04/22/2025 - 17:13

ఐపీఎల్‌-2025లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏప్రిల్ 19న జైపూర్ వేదికగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయినట్లు రాజస్తాన్ క్రికెట్ సంఘం అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. 

సునాయ‌సంగా గెలిచే మ్యాచ్‌లో రాజ‌స్తాన్ ఉద్దేశ‌పూర్వ‌కంగా ఓడిపోయిందంటూ బిహానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ ఆరోప‌ణ‌ల‌పై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్యం స్పందించింది. త‌మ‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు అన్ని అవాస్త‌మ‌ని రాయ‌ల్స్  ఫ్రాంచైజీ సీనియర్ అధికారి దీప్ రాయ్ ఖండించారు.

"అడ్ హాక్ కమిటీ కన్వీనర్ చేసిన అన్ని ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహిరంగంగా చేసే ఇటువంటి  నిరాధారమైన ఆరోపణలు తప్పుదారి పట్టించడమే కాకుండా  రాజస్థాన్ రాయల్స్, రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (RMPL), రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐ ఖ్యాతి,  విశ్వసనీయతకు   తీవ్ర నష్టం కలిగించాయి. 

అవి క్రికెట్ సమగ్రతను కూడా దెబ్బతీశాయి" అని రాయ‌ల్స్ ఫ్రాంచైజీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా రాయ‌ల్స్ యాజ‌మాన్యం.. బిహానీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి, క్రీడా కార్యదర్శికి లేఖ రాశారు.

అస‌లేమి జ‌రిగిందంటే?
ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ అనుహ్యంగా రెండు ప‌రుగుల‌తో తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 180 ప‌రుగులు చేసింది. అనంత‌రం రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేయ‌గల్గింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో త‌మ విజ‌యానికి 9 పరుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా రాజస్తాన్ కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఓట‌మి పాలైంది.
చ‌ద‌వండి: ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం.. రాజస్థాన్‌ రాయల్స్‌పై ఆరోపణలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)