ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?
Breaking News
పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు
Published on Sat, 02/21/2026 - 22:00
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా శనివారం కొలంబో వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడింది.
అయితే టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం ప్రారంభమైంది. మైదానం మొత్తం కవర్లతో కప్పేశారు. దాదాపు రెండున్నర గంటల నిరీక్షణ తర్వాత కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. సూపర్-8 గ్రూప్-2లో ఉన్న ఈ రెండు జట్లకు ఇదే మొదటి మ్యాచ్.
అయితే మొదటి మ్యాచే రద్దు కావడంతో, సెమీస్ చేరాలంటే తర్వాత జరగబోయే మ్యాచుల్లో ఇరు జట్లు కచ్చితంగా గెలవాల్సిందే. న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో బుధవారం శ్రీలంకతో తలపడనుంది. పాక్ విషయానికి వస్తే ఫిబ్రవరి 24న ఇంగ్లండ్‌తో ఆడనుంది.
Tags : 1