Breaking News

కోచ్‌గా ద్రవిడ్‌ ట్రాక్‌ రికార్డు ఇలా.. అయినా..!

Published on Thu, 11/30/2023 - 12:37

టీమిండియా హెడ్‌ కోచ్‌గా బీసీసీఐ మళ్లీ రాహుల్‌ ద్రవిడ్‌నే కొనసాగించింది. ద్రవిడ్‌తో పాటు విక్రమ్‌ రాథోడ్ (బ్యాటింగ్‌ కోచ్‌), పారస్‌ మాంబ్రే (బౌలింగ్‌ కోచ్‌), టి.దిలీప్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌) కాంట్రాక్ట్‌లను కూడా బీసీసీఐ మళ్లీ పొడిగించింది. వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో ఓటమి నేపథ్యంలో ద్రవిడ్‌ కోచింగ్‌ పదవిని మళ్లీ చేపట్టేందుకు సుముఖంగా లేనప్పటికీ బీసీసీఐ ప్రాధేయపడి అతన్ని ఒప్పించినట్లు తెలుస్తుంది.

దక్షిణాఫ్రికా పర్యటనకు ద్రవిడ్‌ను టీమిండియా కోచ్‌గా ఎంపిక చేయడంపై పలువురు భారత క్రికెట్‌ అభిమానులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కోచ్‌గా వరుస వైఫల్యాలు చెందిన వ్యక్తిని మళ్లీ ఎందుకు నియమించారంటూ మండిపడుతున్నారు. 

కోచ్‌గా ద్రవిడ్‌ ట్రాక్‌ రికార్డు ఇలా..!
రాహుల్‌ ద్రవిడ్‌ 2021 నవంబర్‌ 17నుంచి తొలి సారి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. రెండేళ్ల పదవీ కాలాన్ని అతనికి బోర్డు నిర్దేశించింది. వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్న సీనియర్‌ ఆటగాళ్లతో పాటు  అంతకు ముందు వరకు ద్రవిడ్‌ కోచింగ్‌లో అండర్‌–19, భారత్‌ ‘ఎ’ జట్లకు ఆడిన ఆటగాళ్లు చాలా మంది జట్టులో ఉండటంతో కోచింగ్‌లో ద్రవిడ్‌ పని సులువైంది.

అతను కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత జట్టు టెస్టు, వన్డే, టి20ల్లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. అయితే మూడు అవకాశాలు లభించినా ఒక్క సారి కూడా ఐసీసీ టోర్నీని మాత్రం గెలవలేకపోయింది. 2022 టి20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్, 2023 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్, 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమిపాలైంది. అయితే ఫైనల్‌కు ముందు  వరుసగా పది మ్యాచ్‌లలో సంపూర్ణ ఆధిపత్యంతో విజయం సాధించింది.

ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. రెండో సారి కోచ్‌గా ఇప్పుడు ద్రవిడ్‌ బాధ్యతలు డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనతో  మొదలవుతాయి. ఈ టూర్‌లో 3 టి20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడుతుంది. సఫారీ గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌ నెగ్గని రికార్డు భారత్‌కు ఉంది. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతుంది.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)