Breaking News

రాజస్థాన్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌..?

Published on Wed, 09/04/2024 - 15:57

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ నూతన హెడ్‌ కోచ్‌ను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ శనివారం ఆర్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ తమ నూతన హెడ్‌ కోచ్‌గా టీమిండియా తాజా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరును ప్రకటించే అవకాశం ఉంది. 

రాయల్స్‌ 2024 ఎడిషన్‌లో డెడికేటెడ్‌ హెడ్‌ కోచ్‌ లేకుండానే బరిలో నిలిచింది. కుమార సంగక్కర డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా.. ట్రెవర్‌ పెన్నీ, షేన్‌ బాండ్‌లు అసిస్టెంట్‌ కోచ్‌లుగా వ్యవహరించారు. రాయల్స్‌ గత సీజన్‌ ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతుల్లో ఓడింది.

కాగా, ద్రవిడ్‌ 2011-2013 మధ్యలో రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా పని చేశాడు. 2014 ఎడిషన్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. అనంతరం అతను భారత అండర్‌-19, ఇండియా-ఏ, ఎన్‌సీఏలో హెడ్‌ ఆఫ్‌ క్రికెట్‌, టీమిండియా హెడ్‌ కోచ్‌ వంటి హోదాల్లో పని చేశాడు. ద్రవిడ్‌ ఆథ్వర్యంలోనే టీమిండియా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌ను చేజిక్కించుకుంది. 

అలాగే ద్రవిడ్‌ హయాంలో భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు.. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు కూడా చేరింది. తాజా సమాచారం మేరకు ద్రవిడ్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా నియమితుడైతే అసిస్టెంట్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ ఎంపికవుతాడని తెలుస్తుంది. కుమార సంగక్కర డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా కొనసాగే అవకాశం ఉంది.

 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)