Breaking News

రాజస్తాన్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌..!?

Published on Tue, 07/23/2024 - 10:34

భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యాడు. హెడ్‌కోచ్‌గా భార‌త్‌కు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన రాహుల్ ద్ర‌విడ్‌పై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు అత‌డిని త‌మ జ‌ట్టు హెడ్‌కోచ్‌గా నియ‌మించాల‌ని రాయ‌ల్స్ ఫ్రాంచైజీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే రాజ‌స్తాన్ యాజ‌మాన్యం ద్ర‌విడ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ద్ర‌విడ్ కూడా రాజ‌స్తాన్ ఆఫర్‌పై స‌ముఖంగా ఉన్న‌ట్లు వినికిడి. కాగా ఈ మిస్ట‌ర్ డిఫెండ్‌బుల్‌కు రాజ‌స్తాన్‌తో మంచి అనుబంధం ఉంది. గతంలో రాజస్తాన్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా ద్రవిడ్ పనిచేశాడు.  2012, 2013 సీజన్లలో రాజ‌స్తాన్ సార‌థిగా ద్ర‌విడ్ వ్య‌వ‌హరించాడు.

అనంత‌రం 2014. 2015 సీజ‌న్ల‌లో రాజ‌స్తాన్ మెంటార్‌గా త‌న సేవ‌లు అందించాడు. ఇప్పుడు మ‌రోసారి మరోసారి రాయల్స్‌తో జత కట్టేందుకు మిస్ట‌ర్ వాల్‌ సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. .కాగా ప్రస్తుతం రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

సంగ్క‌ర నుంచి కోచింగ్ బాధ్య‌త‌లు ద్ర‌విడ్ తీసుకునే అవ‌కాశ‌ముంది. కాగా కోచ్‌గా కూడా ద్ర‌విడ్‌కు అపార‌మైన అనుభవం ఉంది. 2016, 2017 సీజన్ల‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌( ఢిల్లీ క్యాపిట‌ల్స్‌)కు హెడ్‌కోచ్‌గా ద్ర‌విడ్ ప‌నిచేశాడు.  ఆ త‌ర్వాత 2019 వ‌ర‌కు భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు హెడ్‌కోచ్‌గా ద్ర‌విడ్ కొన‌సాగాడు. ఆ త‌ర్వాత 2021-2024 వ‌ర‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా ద్ర‌విడ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)