Breaking News

టీమిండియా హెడ్‌కోచ్‌ అయితేనేం! కుమారుల కోసం అలా..

Published on Sat, 12/02/2023 - 10:07

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తన భార్య విజితతో కలిసి ఉన్న ఈ చిత్రం మైసూర్‌లోనిది. ద్రవిడ్‌ పెద్ద కుమారుడు సమిత్‌ ఇక్కడ జరుగుతున్న బీసీసీఐ దేశవాళీ టోర్నీ (అండర్‌–19) కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో కర్నాటక తరఫున ఆడుతున్నాడు.

ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ద్రవిడ్‌ వచ్చాడు. మరో వైపు విజయవాడలో జరుగుతున్న అండర్‌–16 విజయ్‌మర్చంట్‌ ట్రోఫీలో ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ బరిలో ఉన్నాడు. ఉత్తరాఖండ్‌తోనే జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు.. కెప్టెన్‌, వికెట్‌కీపర్‌ అయిన అన్వయ్‌ 59 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.   

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే, అతడి కాంట్రాక్ట్‌ను పొడగిస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. తదుపరి టీ20 ప్రపంచకప్‌-2024 వరకు ద్రవిడ్‌నే హెడ్‌కోచ్‌గా కొనసాగించే అవకాశం ఉంది.

ఇక ప్రస్తుతం సెలవులో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ తన కుటుంబానికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో కుమారుడు సమిత్‌ మ్యాచ్‌ చూసేందుకు భార్యతో కలిసి మైదానానికి వెళ్లాడు. 

ఇక ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో ఆల్‌రౌండర్‌ సమిత్‌ తన ఐదు ఓవర్ల బౌలింగ్‌లో రెండు మెయిడెన్స్‌ వేసి 11 పరుగులు ఇచ్చాడు. మొదటిరోజు ఆట ముగిసే సరికి ఉత్తరాఖండ్‌ 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.

ఇదిలా ఉంటే.. రాహుల్‌ ద్రవిడ్‌ గైర్హాజరీ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ద్రవిడ్‌ తిరిగి తన బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా భార్యతో కలిసి ద్రవిడ్‌ మైసూర్‌లో మ్యాచ్‌ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ద్రవిడ్‌ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)