Breaking News

బెస్ట్‌ ఫ్రెండ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు నాదల్‌..

Published on Sun, 09/04/2022 - 11:35

యూఎస్‌ ఓపెన్‌లో స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ దూసుకుపోతున్నాడు. తన బెస్ట్‌ ఫ్రెండ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు ప్రవేశించిన నాదల్‌ 23వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ అందుకునేందుకు మరింత దగ్గరయ్యాడు. భారత కాలామన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో నాదల్‌.. తన స్నేహితుడైన రిచర్డ్‌ గాస్కెట్‌ను 6-0, 6-1, 7-5తో మట్టికరిపించాడు. కాగా యూఎస్‌ ఓపెన్‌లో నాదల్‌ క్వార్టర్స్‌ చేరడం ఇది 18వ సారి కాగా.. తన మిత్రుడిపై ఆధిక్యం కూడా 18-0నే కావడం విశేషం.   

47వ విజయం.. షూ విరగొట్టిన అల్కరాజ్‌


ఇక 19 ఏళ్ల టెన్నిస్‌ యువ కెరటం కార్లోస్‌ అల్కరాజ్‌ ఈ సీజన్‌లో 47వ విజయాన్ని అందుకున్నాడు. మూడో రౌండ్‌లో అమెరికాకు చెందిన జెన్సన్‌ బ్రూక్స్‌ను 6-3, 6-3, 6-3తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఈ సీజన్‌లో 47 విజయాలతో రికార్డు బ్రేక్‌ చేసిన ఆనందలో అల్కరాజ్‌ తన షూస్‌ను విరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్వార్టర్స్‌లో 2014 చాంపియన్‌ మారిన్‌ సిలిచ్‌ను ఎదుర్కోనున్నాడు.

ముగురుజాకు షాక్‌.. క్వార్టర్స్‌ చేరిన స్వియాటెక్‌


ఇక మహిళల సింగిల్స్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ఇగా స్వియాటెక్‌ వరుసగా రెండో ఏడాది క్వార్టర్స్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో అన్‌ సీడెడ్‌ అయిన లారెన్‌ డేవిస్‌ను 6-3, 6-4తో మట్టికరిపించి నాలుగో రౌండ్‌కు చేరుకుంది. ఇక తొమ్మిదో సీడ్‌ గార్బిన్‌ ముగురుజాకు మూడో రౌండ్‌లో చుక్కెదురైంది. మూడో రౌండ్‌లో పెట్రో క్విటోవా చేతిలో 5-7, 6-3, 7-6(12-10)తో ఓడిపోయిన ముగురజా ఇంటిబాట పట్టింది. కాగా క్వార్టర్స్‌లో క్విటోవా.. అమెరికాకు చెందిన జెస్సీకా పెగులాతో తలపడనుంది.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)