ఇంగ్లండ్‌ పర్యటనకు రాధా యాదవ్‌

Published on Fri, 06/13/2025 - 03:14

ముంబై: ఇంగ్లండ్‌లో పర్యటించే భారత మహిళల జట్టుకు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రాధా యాదవ్‌ ఎంపికైంది. శుచి ఉపాధ్యాయ్‌ స్థానంలో ఆమెను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 ఏళ్ల స్పిన్నర్‌ శుచి గత నెల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసింది. తాజాగా ఆమె ఎడమ కాలికి గాయమైంది. 

బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీఓఈ)లో ఏర్పాటు చేసిన శిబిరంలో మహిళల జట్టు సభ్యులు పాల్గొంటున్నారు. త్వరలో అక్కడికి బయలుదేరనున్న మహిళల జట్టు ఇంగ్లండ్‌లో పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడనుంది. ఐదు టి20లు సహా మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు తలపడతాయి. ఇందులో భాగంగా జూన్‌ 28న నాటింగ్‌హామ్‌లో తొలి టి20 జరుగుతుంది. 

జూలై 1న బ్రిస్టల్‌లో రెండో మ్యాచ్, 4న ఓవల్‌లో మూడు, 9న మాంచెస్టర్‌లో నాలుగు, 12న బర్మింమంగ్‌హామ్‌లో ఆఖరి టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్లీ స్ట్రీట్‌ వేదికలపై వరుసగా జూలై 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు.  

భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, యస్తిక, హర్లీన్, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్‌గరే, రాధా యాదవ్‌.  
వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి, ప్రతీక, హర్లీన్, జెమీమా, రిచా, యస్తిక, తేజల్, దీప్తి, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్, అరుంధతి రెడ్డి, క్రాంతి, సయాలీ, రాధా యాదవ్‌.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)