న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్‌..

Published on Thu, 10/24/2024 - 21:18

న్యూజిలాండ్‌ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మొదటి వన్డేలో 59 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ అమ్మాయిలు 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటయ్యారు.

టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్‌ 3 వికెట్లతో అదరగొట్టగా.. అరంగేట్ర బౌలర్‌ సైమా ఠాకూర్‌ రెండు, దీప్తీ శర్మ, అరుంధతి రెడ్డి తలా వికెట్‌ సాధించారు. కివీస్‌ బ్యాటర్లలో బ్రూక్‌ హాలీడే(39) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

ఆఖరిలో అమీలియా కేర్‌(25) పోరాడినప్పటకి, సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఆమె ఆజేయంగా ఉండిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత మహిళల జట్టు 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది.

టీమిండియా బ్యాటర్లలో అరంగేట్ర ప్లేయర్‌ తేజల్ హసబ్నిస్(42) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీప్తీ శర్మ(41), యస్తికా భాటియా(37), షఫాలీ వర్మ(33) రాణించారు. ఇక కివీస్‌ బౌలర్లలో అమీలియా కేర్‌ 4 వికెట్లు సత్తాచాటగా.. జేస్‌ కేర్‌ 3 వికెట్లు సాధించింది. కాగా ఈ మ్యాచ్‌కు భారత రెగ్యూలర్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ దూరం కావడంతో నాయకత్వ బాధ్యతలను స్మృతి మంధాన చేపట్టింది.
చదవండి: IND vs NZ: వ‌ర‌ల్డ్‌ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లోనే
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)