Breaking News

అరంగేట్రంలోనే సిక్స‌ర్ల వ‌ర్షం.. అస్స‌లు త‌గ్గేదేలే!

Published on Sat, 03/23/2024 - 00:35

న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీంద్ర.. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రవీంద్ర ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఈ కివీ స్టార్ టార్గెట్ చేశాడు.

కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో సీఎస్‌కే అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతడు ఇన్నింగ్స్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సీఎస్‌కేకు మరో స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఐపీఎల్‌-2024 మినీ వేలంలో రచిన్‌ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్ కొనుగోలు చేసింది. సీఎస్‌కే నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. ఫీల్డింగ్‌లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)