Breaking News

ఆఫ్ఘనిస్తాన్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌

Published on Thu, 08/22/2024 - 07:09

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీథర్‌ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు బుధవారం ప్రకటించింది. శ్రీథర్‌ త్వరలో జరుగబోయే న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా సిరీస్‌లతో ఆఫ్ఘనిస్తాన్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో శ్రీథర్‌ ఒప్పందం దీర్ఘకాలిక ఒప్పందంగా ఉండే అవకాశం ఉంది.

శ్రీథర్‌కు కోచింగ్‌ విభాగంలో అపార అనుభవం ఉంది. అతను 2021 టీ20 వరల్డ్‌కప్‌ వరకు రవిశాస్త్రి అండర్‌లో టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా పని చేశాడు. 2008-14 వరకు అతను నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో అసిస్టెంట్‌ ఫీల్డింగ్‌ మరియు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు. అలాగే 2014 ఇండియా అండర్‌-19 వరల్డ్‌కప్‌ స్క్వాడ్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 

శ్రీథర్‌ ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీకి కూడా పని చేశాడు. స్వతహాగా లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన శ్రీథర్‌ ఆఫ్ఘన్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. శ్రీథర్‌.. ఆఫ్ఘనిస్తాన్‌ హెడ్‌ కోచ్‌ జోనాథన్‌ ట్రాట్‌ అండర్‌లో పని చేయనున్నాడు. సెప్టెంబర్‌ 9 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ సిరీస్‌ ఆడనుంది. 

ఈ మ్యాచ్‌కు భారత్‌లోని నోయిడా వేదిక కానుంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఆ జట్టుకు నోయిడాను హోం గ్రౌండ్‌గా ఆఫర్‌ చేసింది. సెప్టెంబర్‌ 18 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ షార్జా వేదికగా జరుగనుంది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)