Breaking News

శ్రీలంక ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధ‌ర్‌

Published on Thu, 12/18/2025 - 08:58

భారత మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ను శ్రీలంక జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్‌ వరకు అతడి సేవలు వినియోగించుకోనున్నట్లు శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

2014 నుంచి 2021 వరకు టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన శ్రీధర్‌... ఈ ఏడాది ఆరంభంలో లంకలో 10 రోజుల ప్రత్యేక ఫీల్డింగ్‌ క్యాంప్‌ నిర్వహించాడు. ‘శ్రీధర్‌ను ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించాం. టి20 వరల్డ్‌కప్‌ వరకు అతడు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 300కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు శ్రీధర్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు.

బీసీసీఐ లెవల్‌–3 అర్హత ఉన్న శ్రీధర్‌ అనుభవం మా జట్టుకు ఎంతో ఉపయోగ పడుతుంది. మా ఆటగాళ్ల ఫీల్డింగ్‌ ప్రమాణాలు పెంచేందుకు అతడు సహకరిస్తాడు. పాకిస్తాన్, ఇంగ్లండ్‌ పర్యటనల్లోనూ అతడి సేవలు వినియోగించుకుంటాం’ అని ఎస్‌ఎల్‌సీ తెలిపింది. 

దీనిపై శ్రీధర్‌ స్పందిస్తూ లంక జట్టుతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించాడు. ‘ఆటగాళ్ల తీరుకు తగ్గట్లు కోచింగ్‌ ఉంటుంది. సహజంగా లంకేయులు క్యాచ్‌లు పట్టడంలో చురుకుగా వ్యవహరిస్తారు. ఇక ఫీల్డింగ్‌ నైపుణ్యాలను మెరుగు పరచడం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎవరి శరీర తీరును బట్టి వాళ్ల ప్రయత్నం ఉంటుంది. దానికి అవసరమైన తోడ్పాటు అందించేందుకు ప్రయత్నిస్తా’ అని శ్రీధర్‌ అన్నాడు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)