Breaking News

టీమిండియా స్టార్‌ భావోద్వేగం.. జాతీయ గీతం ఆలపిస్తూ కంటతడి!

Published on Tue, 10/03/2023 - 12:27

తమిళనాడు యువ ఆల్‌రౌండర్‌ సాయి కిషోర్‌ భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్‌పై సాయి కిషోర్‌ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ఈ క్రమంలో సాయి కిషోర్‌ తన తొలి మ్యాచ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు.

జాతీయ గీతం ప్రారంభం కాగానే సాయి కిషోర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సాయి తన తొలి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన సాయి కిషోర్‌ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై 23 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

ఈ విజయంతో ఏషియన్‌ గేమ్స్‌ సెమీఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌(100) సెంచరీతో చెలరేగగా.. ఆఖరిలో రింకూ సింగ్‌(37 నాటౌట్‌ ), శివమ్‌ దుబే(25 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. 

అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  నేపాల్‌..  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌, అవేష్‌ ఖాన్‌ తలా మూడు వికెట్లతో చెలరేగగా.. అర్ష్‌దీప్‌ రెండు, సాయి కిషోర్‌ ఒక్క వికెట్‌ సాధించారు.
చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్‌లో  స్నాక్స్ అమ్మేవాడిని: పాక్‌ స్టార్‌ ఆటగాడు


 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)