Breaking News

శరవేగంగా పావులు కదుపుతున్న అశ్విన్‌

Published on Wed, 09/03/2025 - 08:17

ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన తదుపరి కెరీర్‌ విషయంలో శరవేగంగా పావులు కదుపుతున్నాడు. భారత క్రికెట్‌తో తెగదెంపులు జరిగిపోవడంతో ప్రపంచవాప్తంగా ఉన్న ప్రధాన లీగ్‌ల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయా లీగ్‌ల్లో తనకు నచ్చిన ఫ్రాంచైజీలతో మంతనాలు జరుపుతున్నాడు.

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌, ద హండ్రెడ్‌ లీగ్‌, మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ లీగ్‌ల్లో  వేర్వేరు ఫ్రాంచైజీలతో డీల్స్‌ కూడా కుదిరినట్లు సమాచారం. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌లో ఓ ప్రముఖ ఫ్రాంచైజీతో కూడా టాక్స్‌ నడుస్తున్నట్లు తెలుస్తుంది. విదేశీ లీగ్‌ల్లో ఏ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదిరినా అశ్విన్‌ ప్లేయర్‌ కమ్‌ కోచ్‌గా ద్విపాత్రాభినయం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇలా చేస్తే తనకు కోచింగ్‌ అనుభవం కూడా వస్తుందని యాష్‌ భావిస్తున్నాడట. శరీరం సహకరించని రోజు ఆటగాడి పాత్రకు పుల్‌స్టాప్‌ పెట్టి కోచ్‌గా కొనసావచ్చన్నది అతడి మనోగతం కావచ్చు. క్రికెట్‌ జీనియస్‌గా పేరున్న అశ్విన్‌ ఇదివరకే తన పేరట యూట్యూబ్‌ ఛానల్‌ను నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అతను ప్రపంచ క్రికెట్‌పై తన విశ్లేషణలను అందిస్తుంటాడు.

37 ఏళ్ల ఆశ్విన్‌ ఆగస్ట్‌ 27న ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. భారత క్రికెట్‌తో తన బంధాన్ని పూర్తిగా తెంచుకున్నాడు. బీసీసీఐ నియమాల ప్రకారం.. భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాలి. విశ్వవ్యాప్తంగా లీగ్‌ల్లో ఆడేందుకే యాష్‌ ఐపీఎల్‌కు కాస్త త్వరగా రిటైర్మెంట్‌ ప్రకటించాడని వినికిడి.

 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)