Breaking News

బీసీసీఐతో ‘తెగదెంపులు’: ఆ జట్టుకు ఆడబోతున్న అశ్విన్‌

Published on Thu, 09/25/2025 - 08:43

సిడ్నీ: టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (R Ashwin) తొలిసారి ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL)లో ఆడటం దాదాపుగా ఖాయమైంది. అతడిని జట్టులోకి తీసుకునేందుకు నాలుగు జట్లు ఆసక్తి చూపించాయి. అయితే ‘సిడ్నీ థండర్‌’ టీమ్‌ అశ్విన్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఫ్రాంచైజీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లెవరూ ఇప్పటి వరకు బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడలేదు. అశ్విన్‌ బరిలోకి దిగితే అతనే మొదటి క్రికెటర్‌ అవుతాడు. గత ఏడాది చివర్లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన అతడు.. ఇటీవలే ఐపీఎల్‌నుంచి కూడా తప్పుకొన్న విషయం తెలిసిందే. 

బీసీసీఐతో ‘తెగదెంపులు’
ఈ నేపథ్యంలో బీసీసీఐ నిబంధనల ప్రకారం.. బోర్డుతో అన్ని రకాల సంబంధాలు తెంచుకున్న అశ్విన్‌ ఇకపై  ప్రపంచవ్యాప్తంగా ఏ లీగ్‌లోనైనా పాల్గొనవచ్చు. ఈ క్రమంలో అతను ముందు ఐఎల్‌టి20 టోర్నీ ఆడి ఆపై బీబీఎల్‌కు వెళ్లే అవకాశాలున్నాయి.

బీబీఎల్‌లో 2015–16 సీజన్‌లో ఒకే ఒక సారి చాంపియన్‌షిప్‌ గెలుచుకున్న సిడ్నీ థండర్‌... గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. 2025–26 కోసం ప్రకటించిన థండర్‌ జట్టులో డేవిడ్‌ వార్నర్, సామ్‌ కొన్‌స్టాస్, బాన్‌క్రాఫ్ట్, సామ్‌ బిల్లింగ్స్‌ తదితరులతో పాటు తన్వీర్‌ సంఘా, టామ్‌ ఆండ్రూస్‌ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)