Breaking News

'అశ్విన్‌ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు'

Published on Fri, 12/20/2024 - 16:31

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ ఆకస్మిక రిటైర్‌మెంట్ నిర్ణయం భార‌త క్రికెట్ అభిమానులనే కాకుండా యావ‌త్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బ్రిస్బేన్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంత‌రం అశ్విన్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించి అంద‌రిని షాక్‌కు గురిచేశాడు. 

అయితే టెస్టు క్రికెట్‌లో భారత తరపున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన అశ్విన్ కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా ఆడకుండా రిటైర్ అవ్వడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. 

అతడికి బీసీసీఐ ఫేర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన చేసి షాకయ్యాను. నిజాయితీగా చెప్పాలంటే అశ్విన్ ప‌ట్ల‌ భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్ సరైన రీతిలో వ్యవహరించలేదు. పెర్త్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత విడ్కోలు ప‌ల‌కాల‌ని అశ్విన్ నిర్ణయించకున్నాడని స్వ‌యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌నే చెప్పాడు.

తొలి టెస్టులో త‌నను కాద‌ని వాషింగ్టన్ సుందర్‌ను ఆడించిన తర్వాతే అశ్విన్‌ రిటైర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు సంతోషంగా లేడన్న అంశాన్ని ఆ విషయం చెబుతోంది. నిజం చెప్పాలంటే.. తమిళనాడు నుంచి ఓ క్రికెటర్ ఈ స్ధాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయం.

అందుకు చాలా కారణాలున్నాయి. భారత క్రికెట్‌లో కొన్ని రాష్ట్రాల ఆటగాళ్లకే  మంచి అవకాశాలు లభిస్తాయి. ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ, అశ్విన్ 500 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి లెజెండ్ అయ్యాడు. అశ్విన్‌ కూడా చాలా సార్లు ప‌క్క‌న పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ అలా జ‌రిగినా ప్ర‌తిసారీ అత‌డు పక్షిలా తిరిగి గాల్లోకి ఎగిరాడు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బద్రీనాథ్‌ పేర్కొన్నాడు.
చదవండి: SA vs PAK: చ‌రిత్ర సృష్టించిన పాకిస్తాన్‌.. ప్రపంచం‍లోనే తొలి జట్టుగా
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)