Breaking News

'అశ్విన్‌ ఎంపికలో ఆశ్చర్యమేమీలేదు.. చెన్నైలో చుక్కలు చూపిస్తాడు'

Published on Sun, 10/01/2023 - 08:26

వన్డే ప్రపంచకప్‌-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఖారారు చేసింది. ఆఖరి నిమిషంలో గాయపడిన అక్షర్‌ పటేల్‌ స్ధానంలో అశ్విన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇది మినహా ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే అక్షర్‌ పటేల్‌ స్ధానంలో అశ్విన్‌ను ఎంపిక చేయడం పట్ల చాలా మంది మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఇదే విషయంపై భారత మాజీ స్పిన్నర్‌, 2011 వరల్డ్‌కప్‌ విన్నర్‌ పీయూష్ చావ్లా తన అభిప్రాయాలను వెల్లడించాడు. అశ్విన్‌పై చావ్లా ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్‌కు బ్యాట్‌, బాల్‌తో రాణించగల సత్తా ఉందని చావ్లా కొనియాడాడు. అక్సర్‌కు అ‍శ్విన్‌ సరైన ప్రత్యామ్నాయమని చావ్లా అభిప్రాయపడ్డాడు.

"అక్షర్‌ పటేల్‌ స్ధానంలో అశ్విన్‌ను ఎంపిక చేసి మేనెజ్‌మెంట్‌ సరైన నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అశ్విన్‌కు ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అశ్విన్‌ భారత పిచ్‌లపై మంచి ట్రాక్‌ రికార్డు ఉంది.

అదే విధంగా అతడు బ్యాట్‌తో కూడా రాణించగలడు. అతడొక స్మార్ట్ క్రికెటర్.  గత రెండేళ్లుగా వన్డేల్లో పెద్దగా ఆడకపోయినప్పటికీ అశ్విన్‌కు అపారమైన అనుభవం ఉంది. చెన్నై వేదికగా టీమిండియా  తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే చెన్నై వికెట్‌(పిచ్‌) పరిస్ధితులు అశ్విన్‌కు బాగా తెలుసు. కాబట్టి అతడికి కచ్చితంగా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కుతోంది" అని ఈఎస్పీఈన్‌ క్రిక్‌ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చావ్లా పేర్కొన్నాడు.
చదవండి:World Cup 2023: అరుదైన రికార్డుకు చేరువలో విరాట్‌ కోహ్లి.. కపిల్‌ దేవ్‌, ధోని సరసన

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)