Breaking News

చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. 18 ఏళ్ల కుంబ్లే రికార్డు బద్దలు

Published on Thu, 02/09/2023 - 14:37

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో అలెక్స్‌ క్యారీని ఔట్‌ చేసిన అశ్విన్‌.. ఈ ఘనత సాధించాడు. ఇక 450 టెస్టు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

అశ్విన్‌ సాధించిన రికార్డులు ఇవే
►టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. 89 టెస్టు మ్యాచ్‌లోనే అశ్విన్‌ ఈ ఘనతను సాధించాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే పేరిట ఉండేది.

కుంబ్లే 93 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. 2005లో ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో కుంబ్లే తన 450వ వికెట్‌ను పడగొట్టాడు. ఇక తాజా మ్యాచ్‌తో 18 ఏళ్ల కుంబ్లే రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు. 

► ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(80 మ్యాచ్‌లు) ఉన్నాడు.

► ఇక ఓ‍వరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.

► బంతుల పరంగా ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. తొలి స్థానంలో ఆస్ట్రేలియా గ్రేట్‌ మెక్‌గ్రాత్(23635) ఉండగా.. అశ్విన్‌(23474) రెండో స్థానంలో ఉన్నాడు.
చదవండి: IND vs AUS: వారెవ్వా భరత్‌.. ధోనిని గుర్తుచేశాలా స్టంపౌట్‌! వీడియో వైరల్‌
 

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)