Breaking News

ఎస్‌ఆర్‌హెచ్‌ కీలక నిర్ణయం.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్‌!?

Published on Mon, 12/04/2023 - 19:42

ఐపీఎల్‌-2024 సీజన్‌ వేలానికి ముందు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ట్రేడింగ్‌ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ టైటాన్స​ సారథిగా ఉన్న హార్దిక్‌ పాండ్యాను రూ.15 కోట్లకు ట్రేడింగ్‌ ద్వారా ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో ఇప్పుడు మరో స్టార్‌ ఆటగాడు ఫ్రాంచైజీ మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు ఎవరో కాదు దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌.

డికాక్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ చేసుకోనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. డికాక్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌-2023లో దుమ్మురేపాడు. అయితే గత కొన్ని సీజన్ల నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌కు సరైన ఓపెనింగ్‌ జోడి లేకపోవడంతో స్టార్‌ ఓపెనర్‌ అయినా డికాక్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోందట.

ఇప్పటికే లక్నోతో పాటు డికాక్‌తో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా ఐపీఎల్‌-2023 మినీవేలంలో డికాక్‌ను రూ. 6.75 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఐపీఎల్‌-2024 సీజన్‌కు కూడా అతడినికి లక్నో రిటైన్‌ చేసుకుంది. ఇక ఇప్పటివరకు 96 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన డికాక్‌.. 2907 పరుగులు చేశాడు. టెస్టు,వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన డికాక్‌.. కేవలం టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.  కాగా ఐపీఎల్‌-2024కు సంబంధిచిన వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs AFG: పాకిస్తాన్‌ పొమ్మంది.. సల్మాన్‌ బట్‌కు అఫ్గానిస్తాన్‌ బంపరాఫర్‌!?

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)