Breaking News

కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు

Published on Tue, 07/21/2026 - 09:27

జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్‌గా పీవీ సింధు నిలిచిన సంగతి తెలిసిందే. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు తన విజయం వెనుక ఎవరు దాగున్నారనే విషయాన్ని బయటపెట్టింది. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న సమయంలో కోహ్లి తనకు ధైర్యం చెప్పాడని, అతడిచ్చిన సలహాతోనే ఇవాళ తనను చాంపియన్‌గా నిలబడేలా చేసిందంటూ సింధు అతడిని ప్రశంసలతో ముంచెత్తింది. 

కోహ్లితో పాటు తనకు కష్టకాలంలో అండగా నిలిచిన భర్త వెంకటసాయి దత్తకు కూడా సింధు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ‘ కొంతకాలం కిందట నేను ఫామ్‌లేమితో సతమతమయ్యాను. ఈ సమయంలో కోహ్లిని కలిసి.. మీరు కూడా ఒక దశలో ఫామ్ కోల్పోయి సెంచరీ కోసం పరితపించారు. ఆ సమయం ఎలా గడించింది, దానిని మీరు ఎలా అధిగమించారు’ అని అడిగాను. 

దీనిని కోహ్లి చాలా సింపుల్‌గా తేల్చేశాడు. ఒక ఆటగాడిగా పరుగులు చేయడమే నా పని. దాంట్లోనే నా ఆనందాన్ని వెతుక్కుంటా’ అని పేర్కొన్నాడు. ఆ సమయంలో కోహ్లి అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. కానీ నా బొటనవేలికి గాయం కావడంతో డాక్టర్ మూడు నెలలు విరామం  తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో నా భర్త వెంకట దత్త సాయి మానసిక ప్రశాంతత కోసం నన్ను అట్లాంటాకు తీసుకెళ్లారు. 

గాయాలు, ఫామ్‌పై పెరుగుతున్న సందేహాల నేపథ్యంలో దత్త నాకు కోహ్లి చెప్పిన మాటలను గుర్తుచేసుకోమన్నాడు. అప్పుడు తెలిసింది నాకు కోహ్లి సీక్రెట్‌. విరాట్ చెప్పిన మాటలు ఇప్పటికీ నా మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్య సంభాషణ ఒక ప్రత్యేకమైనదిగానే ఉంచాలనుకుంటున్నా. ఆ తర్వాత కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ అవేంటనేవి మా మధ్యే ఉండడం అవసరమనిపించింది’ అని సింధూ  పేర్కొంది. ఆదివారం జరిగిన జపాన్‌ ఓపెన్‌ ఫైనల్లో అకానే యమగూచిపై విజయం సాధించిన సింధు 19 నెలల  తర్వాత ఒక బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Read: ‘రోహిత్‌, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)