Breaking News

27 నిమిషాల్లోనే...

Published on Wed, 09/17/2025 - 04:08

షెన్‌జెన్‌: చైనా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ సింధు 21–5, 21–10తో ప్రపంచ 44వ ర్యాంకర్‌ జూలీ దవాల్‌ జేకబ్సన్‌ (డెన్మార్క్‌)పై గెలిచింది. కేవలం 27 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి ఇబ్బంది ఎదురుకాలేదు. తొలి గేమ్‌ ఆరంభంలో సింధు చెలరేగి వరుసగా 12 పాయింట్లు నెగ్గడం విశేషం. 

ఈ గెలుపుతో ఈ సీజన్‌లో స్విస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో జూలీ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 6–5తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత రైజింగ్‌ స్టార్‌ ఆయుశ్‌ శెట్టికి నిరాశ ఎదురైంది. 

తొలి రౌండ్‌లో ఆయుశ్‌ 19–21, 21–12, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ చౌ టియెన్‌ చౌ (చైనీస్‌ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో గద్దె రుతి్వక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ 17–21, 11–21తో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్‌) జంట చేతిలో పరాజయం పాలైంది.  

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో... 
గతవారం హాంకాంగ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన ఆయుశ్‌ మంగళవారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. నాలుగు స్థానాలు ఎగబాకిన ఆయుశ్‌ 27వ ర్యాంక్‌లో నిలిచాడు. హాంకాంగ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్య సేన్‌ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 17వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)