Breaking News

సింధు సంచలనం

Published on Fri, 09/19/2025 - 04:13

షెన్‌జెన్‌: ఈ ఏడాది తొలి టైటిల్‌ కోసం వేచి చూస్తున్న భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు... చైనా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ సింధు సంచలన విజయం నమోదు చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్‌ పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 21–15, 21–15తో గెలుపొందింది. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. 

తొలి గేమ్‌ ఆరంభంలో తొలి పాయింట్‌ చేజార్చుకున్న సింధు ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 6–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు 6–4 వద్ద సింధు మళ్లీ చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11–4తో ముందంజ వేసింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్‌ దక్కించుకుంది. రెండో గేమ్‌ హోరాహోరీగా సాగింది. పలుమార్లు ఇద్దరి స్కోరు సమమయ్యాయి. స్కోరు 13–13 వద్ద సింధు విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–13తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

అదే జోరులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో చోచువోంగ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 7–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. ఆన్‌ సె యంగ్‌తో ఇప్పటి వరకు ఏడుసార్లు ఆడిన సింధు ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఆన్‌ సె యంగ్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో సింధు ఒక్క గేమ్‌ మాత్రమే గెలవగలిగింది.   

క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 
పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌ –చిరాగ్‌ శెట్టి (భారత్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–13, 21–12తో సియాంగ్‌ చియె చియు–వాంగ్‌ చి లిన్‌ (చైనీస్‌ తైపీ) జంటపై గెలిచింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో రెన్‌ జియాంగ్‌ యు–జియె హావోనన్‌ (చైనా)లతో సాత్విక్‌–చిరాగ్‌ తలపడతారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)