Breaking News

All England Open: మారని ఆటతీరు.. తొలి రౌండ్‌లోనే ఓటమి

Published on Wed, 03/15/2023 - 19:45

బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌, రెండుసార్లు ఒలింపిక్‌ మెడలిస్ట్‌ అయిన పీవీ సింధు చైనాకుకు చెందిన వైఎమ్‌ ఝాంగ్‌ చేతిలో 21-17, 21-11 వరుస గేముల్లో చిత్తయింది.

39 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు కనీసం పోరాడలేక చేతులెత్తేసింది.  కాగా ఈ ఏడాది తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం పీవీ సింధుకు ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇంతకముందు మలేషియా ఓపెన్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌ తొలి రౌండ్‌లో వెనుదిరిగిన సింధు.. ఇండియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలోనూ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. 

ఇక బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌లో భారత జోడి త్రీసా జోలీ, గాయత్రి గోపిచంద్‌ పుల్లెల థాయ్‌లాండ్‌కు చెందిన ఏడో సీడ్‌ జోంగ్‌కోల్పన్‌ కితిరాకుల్‌, రావిండా ప్రజొగ్జాంయ్‌లకు షాకిచ్చింది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఈ జంటను 21-18, 21-14తో మట్టి కరిపించిన త్రీసా, గాయత్రి పుల్లెల ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, హెచ్‌ఎస్‌ ప్రణోయ్‌లు తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

చదవండి: WPL 2023: యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌.. ఆర్‌సీబీ ఇవాళైనా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)