Breaking News

గుడ్‌న్యూస్‌ చెప్పిన పీవీ సింధు.. పునాది పడింది!

Published on Thu, 11/07/2024 - 11:38

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలింపిక్‌ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు అభిమానులకు శుభవార్త చెప్పింది. తన చిరకాల ఆశయం దిశగా తొలి అడుగు వేసినట్లు తెలిపింది. విశాఖపట్నంలో తన కలల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు గురువారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

సింధు భావోద్వేగం
ఈ మేరకు.. ‘‘విశాఖపట్నంలో పీవీ సింధు సెంటర్‌ ఫర్‌ బ్యాడ్మింటన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌కు పునాది పడింది. ఇది కేవలం క్రీడాకారులకు ఓ సౌకర్యం మాత్రమే కాదు. భవిష్యత్‌ తరాల చాంపియన్లను తీర్చిదిద్దేందుకు, భారత క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకున్న సాహసోపేత నిర్ణయం.

ఇందులో నా భాగస్వాములు, నా టీమ్‌ అందించిన సహకారం మరువలేనిది. భారత భవిష్య క్రీడాకారులకు స్ఫూర్తిని పంచుతూ.. వారి భవిష్యత్‌కు మార్గం వేసే ఈ గొప్ప అడుగు వేసినందుకు సంతోషంగా ఉంది’’ అని సింధు ఉద్వేగపూరిత పోస్టు పెట్టింది.

ఈ క్రమంలో సింధుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రియో ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్‌లో రజతం, టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యం సాధించిన సింధు.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 

ఇదిలా ఉంటే.. రెండుసార్లు వరుసగా ఒలింపిక్‌ మెడల్స్‌ గెలిచిన సింధుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో అకాడమీ కోసం స్థలం కేటాయించింది. ఇప్పుడు అక్కడే ఆమె తన బ్యాడ్మింటన్‌ సెంటర్‌కు పునాది వేసింది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్థలం కేటాయించింది: సింధు
ఈ క్రమంలో తోటగరువులో తనకు కేటాయించిన భూమిలో అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు తాజాగా పూజ చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ఏడాదిలోపు అకాడమీ పనులు పూర్తయ్యేలా సన్నాహకాలు చేస్తున్నా మని తెలిపింది. గత ప్రభుత్వం తమకు అన్ని అనుమతులతో స్థలం కేటాయించిందని.. మెరికల్లాలాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్లను తయారు చేసేందుకు, ఓ మంచి అకాడమీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

చదవండి: IPL 2025 Mega Auction: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్‌పాట్‌ తగలనుందా?

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)