హరియాణా ‘సూపర్‌’ విక్టరీ

Published on Sat, 11/29/2025 - 03:39

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హరియాణా జట్టు ‘సూపర్‌ ఓవర్‌’లో పంజాబ్‌పై విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్‌ అభిషేక్‌ శర్మను విజయవంతంగా అడ్డుకున్న హరియాణా జట్టు ఈ టోర్నీలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో శుక్రవారం జరిగిన ‘సూపర్‌ ఓవర్‌’లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టును హరియాణా పేస్‌ బౌలర్‌ అన్షుల్‌ కంబోజ్‌ హడలెత్తించాడు. 

మూడు బంతుల్లో ఒక పరుగు మాత్రమే ఇచ్చి అభిషేక్‌ శర్మ (0), సాన్‌వీర్‌ సింగ్‌ (0)లను అవుట్‌ చేశాడు. దీంతో రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హరియాణా తొలి బంతికే నిషాంత్‌ (4 నాటౌట్‌) ఫోర్‌ కొట్టడంతో విజయం సాధించింది. అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హరియాణా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. 

కెప్టెన్ అంకిత్‌ కుమార్‌ (26 బంతుల్లో 51; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), నిశాంత్‌ (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆఖర్లో సుమిత్‌ కుమార్‌ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడాడు. పంజాబ్‌ బౌలర్లలో అశ్వని కుమార్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా 207 పరుగులు చేసింది. 

విధ్వంసక ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (6) విఫలం కాగా... అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (37 బంతుల్లో 81; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సాన్‌వీర్‌ సింగ్‌ (16 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సలీల్‌ అరోరా (22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తలా కొన్ని పరుగులు చేశారు. హరియాణా బౌలర్లలో అన్షుల్‌ కంబోజ్, యుజువేంద్ర చహల్, సామంత్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

రెండుసార్లు అభిషేక్‌ను అవుట్‌ చేయడంతో పాటు పరుగులు కట్టడి చేసిన హరియాణా పేసర్‌ అన్షుల్‌ కంబోజ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇదే గ్రూప్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో పుదుచ్చేరి జట్టు 17 పరుగుల తేడాతో బరోడాపై, హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టు 83 పరుగుల తేడాతో సరీ్వసెస్‌పై, బెంగాల్‌ జట్టు మూడు వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయాలు సాధించాయి.  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)