Breaking News

IPL 2025: 'ఈ లెక్కన' పంజాబ్‌దే టైటిల్‌.. రన్నరప్‌ ముంబై ఇండియన్స్‌..!

Published on Sun, 06/08/2025 - 19:10

తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2025 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఆ జట్టు పంజాబ్‌ కింగ్స్‌పై 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది, 18 ఏళ్ల ఐపీఎల్‌ ప్రస్తానంలో తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ, పంజాబ్‌ ఆది నుంచి పోటాపోటీ పడుతూ ఫైనల్‌ వరకు చేరాయి. ఇరు జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. అయితే తుది సమరంలో ఆర్సీబీ అనుభవం ముందు పంజాబ్‌ తలవంచక తప్పలేదు.

ఈ సీజన్‌లో ఆర్సీబీ టైటిల్‌ గెలిచినప్పటికీ.. ఓ రకంగా చూస్తే పంజాబ్‌దే విజయం అని చెప్పవచ్చు. అదెలా అనుకుంటున్నారా..? ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు (అన్ని మ్యాచ్‌ల్లో) చేసిన జట్టుగా పంజాబ్‌ నిలిచింది. ఈ జట్టు ఈ సీజన్‌ మొత్తంలో 3000 పరుగులు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఓ జట్టు ఓ సీజన్‌లో 3000 పరుగుల మార్కును తాకడం ఇదే మొదటిసారి.

ఈ సీజన్‌లో పంజాబ్‌ తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టు ముంబై ఇండియన్స్‌. ఈ సీజన్‌లో ఆ జట్టు 2802 పరుగులు చేసింది. పంజాబ్‌, ముంబై తర్వాత గుజరాత్‌ (2766), లక్నో (2598), ఆర్సీబీ2539), రాజస్థాన్‌ (2496),ఢిల్లీ (2386), సన్‌రైజర్స్‌ (2378), సీఎస్‌కే (2315), కేకేఆర్‌ (1886) అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో వరుస స్థానాల్లో ఉన్నాయి. పరుగుల సంఖ్య ప్రకారం చూస్తే.. అత్యధిక పరగులు చేసిన పంజాబ్‌ను విజేత అనుకోవచ్చు. పంజాబ్‌ తర్వాతి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌ను రన్నరప్‌గా చెప్పుకోవచ్చు.

ఈ లెక్క చూసిన తర్వాత ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గత మూడు సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన జట్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాయి. 2023 సీజన్‌లో గుజరాత్‌ (2906) అత్యధిక పరుగులు చేయగా.. ఆ సీజన్‌ ఫైనల్లో ఆ జట్టు సీఎస్‌కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

2024 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (2906) అత్యధిక పరుగులు చేయగా.. ఫైనల్లో ఆ జట్టు కేకేఆర్‌ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో ఇదే సెంటిమెంట్‌ రిపీటైంది.

ఫోర్లలో ముంబై ఇండియన్స్‌, సిక్సర్లలో పంజాబ్‌
ఈ సీజన్ మొత్తంలో అత్యధిక బౌండరీలు బాదిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలువగా.. అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ నిలిచింది. ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో అన్ని జట్లకంటే ఎక్కువగా 259 బౌండరీలు బాదగా.. పంజాబ్‌ అన్ని జట్లకంటే ఎక్కువగా 173 సిక్సర్లు కొట్టింది.

ఈ సీజన్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన జట్లు..
ముంబై ఇండియన్స్‌- 259
గుజరాత్‌- 256
పంజాబ్‌- 255
ఆర్సీబీ- 238
ఢిల్లీ- 219
సన్‌రైజర్స్‌- 219
లక్నో- 218
రాజస్థాన్‌- 209
సీఎస్‌కే- 199
కేకేఆర్‌- 173

ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లు..
పంజాబ్‌- 173
లక్నో- 152
రాజస్థాన్‌- 146
ముంబై ఇండియన్స్‌- 142
ఆర్సీబీ- 125
గుజరాత్‌- 124
సన్‌రైజర్స్‌- 120
ఢిల్లీ- 109
సీఎస్‌కే- 102
కేకేఆర్‌- 101

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)