Breaking News

విధ్వంసకర వీరుడొచ్చాడు.. వెలగబెట్టిందేమీ లేదు! పాపం పంజాబ్‌..

Published on Fri, 04/21/2023 - 08:14

ఐపీఎల్‌-2023లో పంజాబ్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ లియామ్ లివింగ్‌స్టోన్ తొలి మ్యాచ్‌ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే లివింగ్‌స్టోన్‌ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గురువారం రాయల్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. 

ఆర్సీబీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వేసిన ఓ అద్భుత బంతికి వికెట్ల ముందు లివింగ్‌స్టోన్‌ దొరికిపోయాడు. అదే విధంగా బౌలింగ్‌ విషయానికి వస్తే.. కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే వేసిన లివింగ్‌స్టోన్‌ వికెట్‌ ఏమీ తీయకుండా 9 పరుగులిచ్చాడు. ఈ ఇంగ్లీష్‌ ఆల్‌రౌండర్‌ జట్టుతో చేరి దాదాపు 10 రోజులు అవుతున్న అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో పంజాబ్‌ మేనెజ్‌మెం‍ట్‌ పక్కన పెట్టింది.

ఎట్టకేలకు ఫిట్‌నెస్‌ సాధించడంతో అద్భుత ఫామ్‌లో ఉన్న సికిందర్‌ రజాను పక్కన పెట్టి మరి లివింగ్‌స్టోన్‌కు పంజాబ్‌ మేనెజ్‌మెం‍ట్‌ అవకాశం ఇచ్చింది. పంజాబ్‌ మేనెజ్‌మెం‍ట్‌ నమ్మకాన్ని లివింగ్‌స్టోన్‌ నిలబెట్టుకో లేకపోయాడు. ఇక పంజాబ్‌ చివరి మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన సికిందర్‌ రజా స్ధానంలో లివింగ్‌స్టోన్‌ను తీసుకురావడాన్ని పలువురు మాజీ క్రికెటర్‌లు తప్పుబడుతున్నారు.

రజా లాంటి అద్భుత ఆల్‌రౌండర్‌ జట్టులో ఉండి ఉంటే.. ఆర్సీబీపై పంజాబ్‌ కచ్చితంగా విజయం సాధించి ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ​ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో 24 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమి పాలైంది. కాగా ఈ మ్యాచ్‌కు కూడా పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా దూరమయ్యాడు.
చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్‌

                  ఎట్టకేలకు ఢిల్లీకి దక్కిన విజయం.. ఆరో మ్యాచ్‌లో అతికష్టమ్మీద

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)