Breaking News

టీమిండియా కెప్టెన్‌కు నో ప్ర‌మోష‌న్‌..! క్యాష్‌ ప్రైజ్‌ ఎంతంటే?

Published on Mon, 11/10/2025 - 12:59

భార‌త మ‌హిళ‌ల జ‌ట్టుకు తొలి వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్ టైటిల్‌ను అందించిన కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌ను ఘ‌నంగా స‌త్క‌రించేందుకు పంజాబ్ ప్ర‌భుత్వం సిద్ద‌మైంది. వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో పంజాబ్ రాష్ట్రం నుంచి హ‌ర్మ‌న్‌తో పాటు  హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్ ఉన్నారు.

వీరి ముగ్గ‌రికి త‌లా రూ.1.5 కోట్లు చొప్పున నగదు బహుమతి ఇవ్వాలని భగవంత్ మాన్ స‌ర్కార్ నిర్ణ‌యించున్న‌ట్లు తెలుస్తోంది. పంజాబ్ స‌ర్కార్ త్వ‌ర‌లోనే స‌న్మాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

హ‌ర్మ‌న్‌కు నో ప్ర‌మోష‌న్‌
ప్ర‌స్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) ఉన్న హ‌ర్మ‌న్‌ను ఎస్పీగా ప్ర‌మోట్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ సర్వీస్ నిబంధనల ప్రకారం ఎస్పీగా పదోన్నతి పొందాలంటే ఆమె క‌నీసం 12 నుంచి 15 సంవత్సరాలు స‌ర్వీస్ చేసి ఉండాలి. ఈ క్ర‌మంలోనే హ‌ర్మ‌న్‌ ప్ర‌మోష‌న్‌కు బ‌దుల‌గా క్యాష్ ప్రైజ్ అందుకోనుంది. కాగా 2017 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత హ‌ర్మ‌న్‌ను పంజాబ్ ప్ర‌భుత్వం డీఎస్పీ ఉద్యోగంతో స‌త్క‌రించింది. 

కానీ ఆమె గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన చౌదరి చరణ్  యూనివర్సిటీ యూజీసీ గుర్తింపు లేక‌పోవ‌డంతో వివాద‌స్ప‌దమైంది. దీంతో హ‌ర్మ‌న్‌ను డీఎస్పీ నుండి కానిస్టేబుల్‌గా డిమోట్ చేశారు. అయితే ఆ త‌ర్వాత ఆమె లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తన డిగ్రీని పూర్తి చేసి తిరిగి  డీఎస్పీగా నియమించబడింది. అయితే భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్‌లకు ప్రభుత్వ ఉద్యోగం ల‌భించే అవ‌కాశ‌ముంది.
చదవండి: ఓడినా.. గెలిచినా ఒకటే పాట? ఇదెక్కడి న్యాయం?: భారత మాజీ కెప్టెన్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)