Breaking News

PKL 10: పుణేరీ... తొలిసారి చాంపియన్‌గా

Published on Sat, 03/02/2024 - 01:41

అద్భుతమైన ఆటతో లీగ్‌ దశలో అగ్ర స్థానం... 22 మ్యాచ్‌లలో 17  విజయాలు... స్కోరు తేడాలో ఎవరికీ అందనంత ఎత్తులో ముందంజ... ఈ సీజన్‌లో ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన పుణేరీ పల్టన్‌ తమ జోరును తగ్గించకుండా అసలు పోరులోనూ సత్తా చాటి తమ స్థాయిని ప్రదర్శించింది...

గత సీజన్‌లో త్రుటిలో చేజారిన ట్రోఫీని ఈసారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా ఒడిసి పట్టుకుంది... ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో తొలిసారి చాంపియన్‌గా సగర్వంగా  నిలిచింది. మొదటిసారి ఫైనల్‌ చేరిన హరియాణా స్టీలర్స్‌ ఆరంభంలో ఆకట్టుకున్నా... ఒత్తిడిలో తలవంచి రన్నరప్‌కే పరిమితమైంది.   

సాక్షి, హైదరాబాద్‌: కబడ్డీ అభిమానులను 91 రోజుల పాటు అలరించిన ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ అట్టహాసంగా ముగిసింది. అన్ని విధాలా ఆధిపత్యం ప్రదర్శించిన పుణేరీ పల్టన్‌ మొదటిసారి లీగ్‌ చాంపియన్‌గా అవతరించింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో పల్టన్‌ 28–25 పాయింట్ల తేడాతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి 13–10తో ఆధిక్యంలో నిలిచిన పల్టన్‌ బలమైన డిఫెన్స్‌తో చివరి వరకు దానిని నిలబెట్టుకోవడంలో సఫలమైంది. గత సీజన్‌ ఫైనల్లో ఓడిన పుణేరీ వరుసగా రెండోసారి తుది పోరుకు అర్హత సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.  

మ్యాచ్‌లో ఇరు జట్లు ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్‌కే ప్రాధాన్యతనిచ్చాయి. ఫలితంగా తొలి 10 నిమిషాల్లోనే 13 ఎంప్టీ రైడ్‌లు వచ్చాయి. ప్రతీ పాయింట్‌ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... ఒకదశలో పుణేరీ 9–7తో స్వల్ప ఆధిక్యంలోనే ఉంది. అయితే ఈ దశలో 19వ నిమిషంలో పంకజ్‌ మోహితే డు ఆర్‌ డై రెయిడ్‌ మ్యాచ్‌ దిశను మార్చింది. ఒకేసారి 4 పాయింట్లు సాధించి అతను పుణేను ముందంజలో నిలిపాడు. ఆ తర్వాత ఈ అంతరాన్ని తగ్గించడంలో స్టీలర్స్‌ విఫలమైంది. 23వ నిమిషంలో స్టీలర్స్‌ను పల్టన్‌ జట్టు ఆలౌట్‌ కూడా చేయడంతో ఆట పూర్తిగా వారివైపు మొగ్గింది.

చివరి పది నిమిషాల్లో హరియాణా పుంజుకున్నా అది విజయానికి సరిపోలేదు. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లూ 15 పాయింట్లు చొప్పున సమానంగా స్కోరు చేసినా... తొలి అర్ధ భాగంలో వెనుకబడిన 3 పాయింట్లే చివరకు స్టీలర్స్‌ ఓటమికి కారణమయ్యాయి. పల్టన్‌ తరఫున పంకజ్‌ మోహితే 9 పాయింట్లు సాధించగా... మోహిత్‌ 5, కెప్టెన్‌ అస్లమ్‌ 4 పాయింట్లు సాధించారు. స్టీలర్స్‌ ఆటగాళ్లలో అత్యధికంగా శివమ్‌ 6, సిద్ధార్థ్‌ దేశాయ్‌ 4 పాయింట్లు స్కోరు చేశారు. విజేతగా నిలిచిన పుణేరీ జట్టుకు రూ. 3 కోట్లు, రన్నరప్‌ హరియాణా జట్టుకు రూ. 1 కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ విజేత జట్టుకు ట్రోఫీని అందజేశాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)