Breaking News

Pro kabaddi League 2023: మళ్లీ ఓడిన టైటాన్స్‌ 

Published on Tue, 01/02/2024 - 09:02

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 18–54 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్‌ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో టైటాన్స్‌ జట్టుకిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్‌ జట్టు కెపె్టన్‌ పవన్‌ సెహ్రావత్‌ ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.

పవన్‌ కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. మొత్తం 14 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన పవన్‌ ఒకసారి సఫలమై, మరోసారి బోనస్‌ పాయింట్‌ రాబట్టాడు. తొమ్మిదిసార్లు పాయింట్‌ సాధించకుండానే తిరిగి వచ్చాడు. టైటాన్స్‌ జట్టు మరో ప్లేయర్‌ సందీప్‌ ఐదు పాయింట్లు గెలిచాడు. మరోవైపు పుణేరి పల్టన్‌ తరఫున మోహిత్‌ గోయట్, అస్లమ్‌ ముస్తఫా చెలరేగిపోయారు.

మోహిత్‌ 13 పాయింట్లు, అస్లమ్‌ 8 పాయింట్లు స్కోరు చేశారు. గౌరవ్‌ ఖత్రీ (6), అభినేశ్‌ (5), మొహమ్మద్‌ రెజా (5) కూడా రాణించారు. మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ 48–41తో యూపీ యోధాస్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్‌ కెప్టెన్‌ ప్రదీప్‌ నర్వాల్‌ 21 పాయింట్లతో అదరగొట్టినా తన జట్టును గెలిపించలేకపోయాడు. 
చదవండి: సంజూ శాంసన్‌ భారీ సిక్సర్‌.. బంతి ఎక్కడ పడిందో తెలుసా? వీడియో వైరల్‌

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు