Breaking News

38 పాయింట్ల తేడాతో...

Published on Sat, 12/14/2024 - 04:01

 పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణేరి పల్టన్‌ 38 పాయింట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై శుక్రవారం జరిగిన ఈ పోరులో పల్టన్‌ 56–18 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన పల్టన్‌ ఓవరాల్‌గా 26 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... బెంగళూరు బుల్స్‌ 11 రెయిడ్‌ పాయింట్లకే పరిమితమైంది. 

డిఫెన్స్‌లోనూ ఆకట్టుకున్న పల్టన్‌ 15 పాయింట్లతో మెరిస్తే... బుల్స్‌ 7 ట్యాకిల్‌ పాయింట్లే సాధించింది. ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్‌ చేసిన పల్టన్‌ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంటే... బుల్స్‌ ఒక్కసారి కూడా ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయలేకపోయింది. పల్టన్‌ తరఫున రెయిడర్లు ఆకాశ్‌ షిండే, మోహిత్‌ గోయత్, ఆర్యవర్ధన్‌ తలా 8 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్‌ తరఫున స్టార్‌ రెయిడర్‌ ప్రదీప్‌ నర్వాల్‌ 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. 

తాజా సీజన్‌లో 19 మ్యాచ్‌లు ఆడిన పుణేరి పల్టన్‌ 8 విజయాలు, 8 పరాజయాలు, 3 ‘టై’లతో 54 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న బెంగళూరు బుల్స్‌ 19 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో పట్టిక అట్టడుగున కొనసాగుతోంది. శుక్రవారమే జరిగిన మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 42–38 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది. 

పట్నా తరఫున అయాన్‌ 13, దేవాంక్‌ 12 పాయింట్లతో రాణించగా... తలైవాస్‌ తరఫున మోయిన్‌ 11 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో 18 మ్యాచ్‌లాడిన పైరెట్స్‌ 11 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 63 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ (రాత్రి 8 గంటలకు), దబంగ్‌ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.   

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)