Breaking News

పుణేరి పల్టన్‌ ‘హ్యాట్రిక్‌’

Published on Thu, 09/04/2025 - 04:12

విశాఖ స్పోర్ట్స్‌:  ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో మాజీ చాంపియన్‌ పుణేరి పల్టన్‌ వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 45–36 తో బెంగాల్‌ వారియర్స్‌ జట్టుపై  నెగ్గింది. కెప్టెన్, ఆల్‌రౌండర్‌ అస్లామ్‌ ఇనామ్‌దార్, రెయిడర్‌ ఆదిత్య షిండే పుణేరి విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు చెరో 11 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్‌ మోహితే, విశాల్‌ చెరో 5 పాయింట్లు సాధించారు. 

తొలి అర్ధభాగం ముగిసేసరికి పుణేరి 26–22తో స్వల్పంగా ముందంజలో నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ పల్టన్‌ తమ జోరును కొనసాగించింది. రెండో ‘ఆలౌట్‌’తో ఆ జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. బెంగాల్‌ తరఫున కెపె్టన్‌ దేవాంక్‌ ఒక్కడే 17 పాయింట్లు స్కోరు చేసినా లాభం లేకపోయింది. హరియాణా స్టీలర్స్, యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్‌ ముందు ‘టై’గా ముగిసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 36–36 పాయింట్లతో సమంగా నిలిచాయి. 

హరియాణా ఆటగాళ్లలో నవీన్‌ కుమార్‌ 9, వినయ్‌ 8 పాయింట్లు సాధించగా...ముంబా జట్టు తరఫున అజిత్‌ చౌహాన్‌ ఒక్కడే 12 పాయింట్లు సాధించడం విశేషం. అయితే చివరకు ‘టైబ్రైక్‌’లో హరియాణాను విజయం వరించింది. ఇందులో హరియాణా 7–6తో ముంబాపై పైచేయి సాధించింది.  నేడు జరిగే మ్యాచ్‌ ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్‌... పుణేరి పల్టన్‌తో దబంగ్‌ ఢిల్లీ తలపడతాయి.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)