Breaking News

పుణేరి పల్టన్‌ ‘టాప్‌’ షో

Published on Fri, 09/19/2025 - 04:31

జైపూర్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో పుణేరి పల్టన్‌ ‘హ్యాట్రిక్‌’ విజయం నమోదు చేసుకొని పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పుణేరి పల్టన్‌ గురువారం జరిగిన పోరులో యు ముంబాపై ఏకపక్ష విజయం సాధించింది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన పుణేరి పల్టన్‌ 40–22 పాయింట్ల తేడాతో యు ముంబాను చిత్తుచేసింది. పుణేరి పల్టన్‌ జట్టు తరఫున స్టువర్ట్‌ సింగ్‌ 8 పాయింట్లు, గుర్‌దీప్‌ 5 పాయింట్లు సాధించగా... అభినేష్, గౌరవ్‌ ఖత్రి చెరో 4 పాయింట్లు సాధించారు. 

యు ముంబా జట్టు తరఫున అమీర్‌ మొహమ్మద్‌ 6 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో యు ముంబా జట్టు 12 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... ఫుణేరి పల్టన్‌ జట్టు 14 రెయిడ్‌ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే ట్యాక్లింగ్‌లో యు ముంబా 6 పాయింట్లకు పరిమితం కాగా... పల్టన్‌ 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన పుణేరి పల్టన్‌ 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్‌’ ప్లేస్‌కు చేరింది. 

మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 45–41తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలుపొందింది. జైపూర్‌ రైడర్లు నితిన్‌ 13, అలీ 12 పాయింట్లతో విజృంభించగా... వారియర్స్‌ తరఫున దేవాంక్‌ 16, మన్‌ప్రీత్‌ 10 పాయింట్లు సాధించారు. దేవాంక్‌కు ఇది వరుసగా ఏడో ‘సూపర్‌–10’ కావడం విశేషం. ఈ లీగ్‌ చరిత్రలో అత్యంత వేగంగా (38 మ్యాచ్‌ల్లో) 400 రెయిడ్‌ పాయింట్లు సాధించిన ప్లేయర్‌గా దేవాంక్‌ నిలిచాడు. నేడు పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్, తమిళ్‌ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్‌ ఆడతాయి. 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు