Breaking News

పల్టన్‌ ఫటాఫట్‌

Published on Mon, 11/25/2024 - 04:00

నోయిడా: డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణేరి పల్టన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు బెంగాల్‌ వారియర్స్‌ చేతులెత్తేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ అర్ధసెంచరీని మించిన పాయింట్లను అవలీలగా చేసింది. కూతకెళ్లిన రెయిడర్లు, డిఫెండర్లు క్రమం తప్పకుండా పాయింట్లను సాధించారు. దీంతో పల్టన్‌ 51–34 స్కోరుతో 17 పాయింట్ల తేడాతో వారియర్స్‌పై జయభేరి మోగించింది. ఆట మొదలైన 7 నిమిషాలకే బెంగాల్‌ ఆలౌటైంది. 

మళ్లీ తొలి అర్ధభాగం ముగిసే దశలో ఆలౌట్‌ కావడంతో 24–11తో పుణేరి పూర్తి ఆధిపత్యంతో బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం రెండో అర్ధభాగంలోనూ వారియర్స్‌ ఆటతీరు ఏమాత్రం మారలేదు. ఐదు నిమిషాలకే మ్యాచ్‌లో మూడోసారి ఆలౌటైంది. 11 నిమిషాల వ్యవధిలో నాలుగోసారి ఆలౌటైంది. పుణేరి జట్టు మ్యాచ్‌లో ఒకే ఒక్కసారి అది కూడా మ్యాచ్‌ ముగిసే ఆఖరి నిమిషంలో ఆలౌట్‌ కాగా... అప్పటికే పాయింట్ల ఫిఫ్టీ కొట్టింది. 

పల్టన్‌ రెయిడర్లు ఆకాశ్‌ షిండే (9 పాయింట్లు), మోహిత్‌ గోయత్‌ (9), పంకజ్‌ మోహితె (6), డిఫెండర్లు మోహిత్‌ (5), గౌరవ్‌ ఖత్రి (3) రాణించారు. బెంగాల్‌ తరఫున రెయిడర్‌ నితిన్‌ కుమార్‌ (13) అదరగొట్టాడు. మిగతా వారిలో కెప్టెన్, డిఫెండర్‌ ఫజల్‌ అత్రాచలి (3), ప్రణయ్‌ రాణే (5) మెరుగ్గా ఆడారు. తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 44–42తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. 

యూపీ ఆటగాళ్లలో గగన్‌ గౌడ (11), భవాని రాజ్‌పుత్‌ (10), హితేశ్‌ (8)లు రాణించారు. పట్నా జట్టులో రెయిడర్‌ దేవాంక్‌ (18) ఆకట్టుకున్నాడు. అయాన్‌ (10) రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ తలపడనుండగా, యు ముంబాతో బెంగళూరు బుల్స్‌ పోటీపడుతుంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)