Breaking News

డోపింగ్‌లో దొరికిన మారథాన్‌ విజేత

Published on Sat, 02/22/2025 - 07:04

న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం పుణేలో నిర్వహించిన హాఫ్‌ మారథాన్‌ పరుగులో విజేతగా నిలిచిన ప్రధాన్‌ విలాస్‌ కిరులేకర్‌ డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో అతనిపై తాత్కాలిక నిషేధం విధించారు. డిసెంబర్‌లో నిర్వహించిన 21.09 కిలోమీటర్ల రేసును ప్రధాన్‌ విలాస్‌ అందరికంటే ముందుగా ఒక గంటా 4 నిమిషాల 22 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. 

అయితే అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని ల్యాబ్‌లో పరీక్షించగా, నిషిద్ధ ఉ్రత్పేరకం మెల్డొనియమ్‌ తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్లూఏ)కు చెందిన స్వతంత్ర ఏజెన్సీ అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) ప్రధాన్‌ విలాస్‌పై చర్యలు చేపట్టింది. 

గతనెల భారత్‌కు చెందిన లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ మాధురి కాల్‌ డోపింగ్‌ పరీక్షల్లో పట్టుబడటంతో ఏఐయూ సస్పెన్షన్‌ వేటు వేసింది.  2016లో రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపొవా కూడా ఈ మెల్డొనియమ్‌ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో ఆమెపై కూడా సస్పెన్షన్‌ వేటు వేశారు. సాధారణంగా మెల్డొనియమ్‌ను డాక్టర్లు హృద్రోగులకు, నరాల జబ్బులున్న రోగులకు శక్తి కోసం సిఫారసు చేస్తారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)