Breaking News

పీటీ ఉష ఇంట్లో విషాదం

Published on Sat, 01/31/2026 - 04:17

కోజికోడ్‌: దిగ్గజ అథ్లెట్, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్‌ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. తమ నివాసంలో అనూహ్యంగా కుప్పకూలిన శ్రీనివాసన్‌ను సన్నిహితులు ఆస్పత్రికి తీసుకెళ్లినా... అప్పటికే ఆయన మరణించారు. స్వతహాగా కబడ్డీ క్రీడాకారుడు అయిన శ్రీనివాసన్‌ సెంట్రల్‌ ఇండ్రస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)లో డిప్యూటీ ఎస్పీగా పని చేసి రిటైరయ్యారు. 

ఉష కెరీర్‌లో అన్ని విధాలా సహకారం అందిస్తూ ప్రోత్సహించడంతో పాటు ఆమె పురోగతిలో భర్త కీలక పాత్ర పోషించారు. 90వ దశకంలో ఉష రిటైర్మెంట్‌ ప్రకటించి ఆటకు దూరమైన తర్వాత మళ్లీ 1998 ఆసియా చాంపియన్‌షిప్‌ ద్వారా ఆమె ట్రాక్‌పైకి పునరాగమనం చేసేందుకు శ్రీనివాసన్‌ అండగా నిలిచారు. రిటైర్మెంట్‌ తర్వాత ఆయన ఉష స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌ నిర్వహణా వ్యవహారాలు చూస్తున్నారు. వీరిద్దరికి ‘ఉజ్వల్‌’ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఉషతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఆమె భర్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.    

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)