Breaking News

రెచ్చిపోయిన షాదాబ్‌ ఖాన్‌.. డస్సెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ వృధా

Published on Sun, 02/18/2024 - 07:45

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌పై ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖలందర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా..  ఇస్లామాబాద్‌ టీమ్‌ 18.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన డస్సెన్‌..
వాన్‌ డర్‌ డస్సెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో (41 బంతుల్లో 71 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ భారీ స్కోర్‌ చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (57) అర్దసెంచరీతో రాణించగా.. షఫీక్‌ 28, ఫకర్‌ జమాన్‌ 13, డేవిడ్‌ వీస్‌ 14 పరుగులు చేశారు. కెప్టెన్‌ షాహీన్‌ అఫ్రిది డకౌటయ్యాడు. ఇస్లామాబాద్‌ బౌలర్లలో టైమాల్‌ మిల్స్‌ 2, షాదాబ్‌ ఖాన్‌, నసీం షా తలో వికెట్‌ పడగొట్టారు. 

రెచ్చిపోయిన షాదాబ్‌ ఖాన్‌..
196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్‌.. కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ (41 బంతుల్లో 74 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అఘా సల్మాన్‌ (31 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్దశతకాలతో రెచ్చిపోవడంతో మరో 10 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అలెక్స్‌ హేల్స్‌ (36) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడగా.. కొలిన్‌ మున్రో (5) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఖలందర్స్‌ బౌలర్లలో జమాన్‌ ఖాన్‌, సల్మాన్‌ ఫయాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు