Breaking News

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11: ఎదురులేని పుణెరి పల్టన్‌

Published on Mon, 11/04/2024 - 21:33

హైదరాబాద్‌, 4 నవంబర్‌ 2024 : డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌ టాప్‌ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీకెఎల్‌ 11 లీగ్‌ దశ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌పై 49-30తో పుణెరి పల్టన్‌ ఏకపక్ష విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ సమిష్టిగా మెరిసిన పుణెరి పల్టన్‌ 19 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేయటం విశేషం. పుణెరి పల్టన్‌ ఆటగాళ్లలో ఆకాశ్‌ షిండె (11 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరువగా.. పంకజ్‌ మోహితె (8 పాయింట్లు), మోహిత్ గోయత్‌ ( 5 పాయింట్లు), ఆమన్‌ ( 5 పాయింట్లు), గౌరవ్‌ ఖత్రి ( 5 పాయింట్లు) అదరగొట్టారు. 

గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున గుమన్‌ సింగ్‌ ( 13 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో ఒంటరి పోరాటం చేశాడు. పుణెరి పల్టన్‌ ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించగా, గుజరాత్‌ జెయింట్స్‌ ఐదు మ్యాచుల్లో నాల్గో పరాజయం చవిచూసింది.

పల్టన్‌ వన్‌సైడ్‌ షో : 
వరుస విజయాల జోరుమీదున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌.. గుజరాత్‌ జెయింట్స్‌పై పంజా విసిరింది. ప్రథమార్థంలోనే ఆ జట్టుపై ఏకంగా 21 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. ప్రథమార్థం తొలి ఐదు నిమిషాల్లో, చివరి ఐదు నిమిషాల ఆటలో గుజరాత్‌ జెయింట్స్‌ను ఆలౌట్‌ చేసిన పుణెరి పల్టన్‌ 30-9తో వన్‌సైడ్‌ షో చేసింది. కెప్టెన్‌ అస్లాం ఇనందార్‌ బరిలో లేకపోయినా.. ఆకాశ్‌ షిండే, పంకజ్‌ మోహితె, మోహిత్‌ గోయత్‌లు కూతలో కేక పెట్టించారు. 

పంకజ్‌ మోహితె, మోహిత్‌ గోయత్‌లు కండ్లుచెదిరే సూపర్‌ రెయిడ్లతో ఆకట్టుకున్నారు. డిఫెన్స్‌లో గౌరవ్‌ ఖత్రి, ఆమన్‌ ట్యాకిల్స్‌ జెయింట్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. తొలి పది నిమిషాల్లో 14-5తో ముందంజ వేసిన పుణెరి పల్టన్‌.. తర్వాతి పది నిమిషాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాయింట్లు సాధించింది. గుజరాత్‌ జెయింట్స్‌ పూర్తిగా తేలిపోయింది. గుమన్‌ సింగ్‌ కూతలో మెరిసినా.. ఇతర ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారు.

గుజరాత్‌ పుంజుకున్నా.. పుణెరి అదే జోరు : 
విరామం అనంతరం సైతం పుణెరి పల్టన్‌ జోరు తగ్గలేదు. గుజరాత్‌ జెయింట్స్‌ ఆట కాస్త మెరుగైనా.. పుణెరి పల్టన్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో రాణించలేదు. ద్వితీయార్థం తొలి పది నిమిషాల తర్వాత పుణెరి పల్టన్‌ 41-16తో 25 పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. 

క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన గుజరాత్‌ జెయింట్స్‌ ఆఖరు ఐదు నిమిషాల ఆట మిగిలి ఉండగా పుణెరి పల్టన్‌ను ఆలౌట్‌ చేసింది. పాయింట్ల అంతరం తగ్గించేందుకు చివరి ఐదు నిమిషాల్లో మంచి ప్రయత్నమే చేసింది. అయినా, పుణెరి పల్టన్‌ అలవోకగా సీజన్లో ఐదో విజయం సాధించింది. ద్వితీయార్థంలో పుణెరి పల్టన్‌ 19 పాయింట్లు సాధించగా, గుజరాత్‌ జెయింట్స్‌ 21 పాయింట్లు దక్కించుకుంది.

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)