Breaking News

చివరి బెర్త్‌ పట్నా పైరేట్స్‌దే

Published on Fri, 10/24/2025 - 04:19

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకుంది. గురువారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో పట్నా 33–18 పాయింట్ల తేడాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది. దీంతో లీగ్‌ దశలో 18 మ్యాచ్‌లాడిన పట్నా పైరేట్స్‌ 8 విజయాలు, 10 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. లీగ్‌ ఆరంభ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన పైరేట్స్‌... వరుసగా ఐదో మ్యాచ్‌లో గెలిచి ముందంజ వేసింది. 

కీలకపోరులో పట్నా కెపె్టన్‌ అయాన్‌ 11 పాయింట్లతో సత్తా చాటాడు. మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో హోరాహోరీ పోరాటం సాగడంతో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ద్వితీయార్ధంలో విజృంభించిన పట్నా సమష్టిగా సత్తాచాటి ముందంజ వేసింది. గురువారంతో ఈ సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. చివరి రోజే జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌ 35–32తో యు ముంబాపై, బెంగళూరు బుల్స్‌ 54–26తో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపొందాయి. 

యూపీ యోధాస్‌ తరఫున సురేందర్‌ గిల్, శివమ్‌ చెరో 7 పాయింట్లు సాధించగా... యు ముంబా తరఫున అజిత్‌ చవాన్‌ 11 పాయింట్లతో పోరాడాడు. గుజరాత్‌ జెయింట్స్‌తో పోరులో బెంగళూరు బుల్స్‌ రెయిడర్లు ఆకాశ్‌ 11, అలీ రెజా 10 పాయింట్లతో సత్తా చాటారు. గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున శ్రీధర్‌ 8 పాయింట్లతో పోరాడాడు. 

ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడగా... వాటిలో 8 జట్లు (పుణేరి పల్టన్, దబంగ్‌ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్, హర్యానా స్టీలర్స్, యు ముంబా, పట్నా పెరైట్స్, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌) ప్లే ఆఫ్స్‌కు చేరాయి. లీగ్‌లో నేడు విశ్రాంతి దినం కాగా... శనివారం నుంచి ప్లే ఆఫ్స్‌ ప్రారంభమవుతాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)