Breaking News

ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరంభ తేదీ ప్రకటన

Published on Wed, 09/04/2024 - 10:04

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌ అక్టోబరు 18వ తేదీన మొదలవుతుంది. మూడు నగరాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో అక్టోబరు 18 నుంచి తొలి అంచె పోటీలు జరుగుతాయి. అనంతరం నవంబరు 10 నుంచి రెండో అంచె మ్యాచ్‌లకు నోయిడా నగరం ఆతిథ్యమిస్తుంది. 

చివరి అంచె పోటీలు డిసెంబరు 3 నుంచి పుణేలో జరుగుతాయని... పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని పీకేఎల్‌ లీగ్‌ కమిషనర్‌ అనుపమ్‌ గోస్వామి తెలిపారు. కాగా 2014లో ప్రొ కబడ్డీ లీగ్‌ మొదలైంది. ఇప్పటి వరకు 10 సీజన్లపాటు ఈ టోర్నీ జరిగింది. పుణేరి పల్టన్‌ జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 

తెలుగు టైటాన్స్‌ దారుణ వైఫల్యం
పట్నా పైరేట్స్‌ జట్టు అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలువగా... జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు రెండుసార్లు టైటిల్‌ను దక్కించుకుంది. బెంగాల్‌ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్‌ ఢిల్లీ, యు ముంబా, పుణేరి పల్టన్‌ జట్లు ఒక్కోసారి చాంపియన్‌గా నిలిచాయి. తెలుగు టైటాన్స్‌ జట్టు రెండో సీజన్‌లో మూడో స్థానంలో, నాలుగో సీజన్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. గత మూడు సీజన్లలో తెలుగు టైటాన్స్‌ జట్టు చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)