Breaking News

పుణెరి పల్టాన్‌ మెరుపుల్‌

Published on Mon, 11/04/2024 - 07:06

హైదరాబాద్‌, 3 నవంబర్‌ 2024 : పుణెరి పల్టన్‌ పీకెఎల్‌ సీజన్‌ 11లో నాల్గో విజయం సాధించింది. ఆదివారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ యు ముంబాపై 35-28తో ఏడు పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ అస్లాం ఇనందార్‌ (10 పాయింట్లు) సూపర్‌ టెన్‌ షోతో మెరువగా.. మోహిత్‌ గోయత్‌ (9 పాయింట్లు), గౌరవ్‌ ఖత్రి (7 పాయింట్లు) ఆకట్టుకున్నారు. యు ముంబా తరఫున అజిత్‌ చవాన్‌ (9 పాయింట్లు), మంజిత్‌ (6 పాయింట్లు), ఆమిర్‌మొహమ్మద్‌ (4  పాయింట్లు) రాణించినా ఆ జట్టుకు సీజన్లో రెండో ఓటమి తప్పలేదు.  ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలతో పుణెరి పల్టన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.


పుణెరి పల్టాన్‌ మెరుపుల్‌
యు ముంబా, పుణెరి పల్టన్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పుణెరి పల్టాన్‌ తొలి మూడు నిమిషాల్లో 4-0తో దూకుడు చూపించగా.. యు ముంబా నాల్గో నిమిషంలో పాయింట్ల ఖాతా తెరిచింది. యు ముంబా రెయిడర్లు మంజిత్‌, అజిత్‌ చవాన్‌లు రాణించటంతో ఆ జట్టు పుంజుకుంది. 10 నిమిషాల ఆట అనంతరం 8-7తో ఆధిక్యంలో నిలిచింది. చివరి పది నిమిషాల్లో పుణెరి పల్టన్‌ పుంజుకుంది. యు ముంబాను ఆలౌట్‌ చేసింది. అస్లాం ఇనాందార్‌, మోహిత్‌ గోయత్‌లు రెచ్చిపోవటంతో ప్రథమార్థంలో పుణెరి పల్టాన్‌ ఆరు పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. విరామ సమయానికి పుణెరి పల్టన్‌ 22-16తో యు ముంబాపై పైచేయి సాధించింది. రెయిడింగ్‌లో యు ముంబా 14 పాయంట్లతో మెరిసింది. పుణెరి పల్టన్‌ రెయిడింగ్‌లో 11 పాయింట్లే సాధించింది. డిఫెండర్లు రాణించటంతో పుణెరి పల్టన్‌ పైచేయి సాధించింది.

విరామం తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. తొలి పది నిమిషాల్లో పాయింట్ల కోసం ఇరు జట్లు చెమటోడ్చాయి. చెరో ఆరు పాయింట్లు సాధించచటంతో 30 నిమిషాల అనంతరం 28-22తో పుణెరి పల్టన్‌దే పైచేయిగా నిలిచింది. పుణెరి పల్టన్‌ను  ఆలౌట్‌ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని యు ముంబా వెనుకంజలోనే కొనసాగింది. ఆఖరు వరకు జోరు కొనసాగించిన పుణెరి పల్టన్‌ సీజన్లో నాల్గో విజయం సాధించింది

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)