Breaking News

ఢిల్లీ ఆటగాడి తుపాన్‌ ఇన్నింగ్స్‌.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు! వీడియో

Published on Sat, 08/31/2024 - 16:28

ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌-2024లో సంచ‌ల‌నం న‌మోదైంది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఓపెన‌ర్ ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. ఈ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో ప్రియంష్ ఈ ఘ‌న‌త సాధించాడు. 

సౌత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ 12 ఓవ‌ర్ వేసిన స్పిన్న‌ర్ మనన్ భరద్వాజ్ బౌలింగ్‌లో ప్రియంష్ వ‌రుస‌గా 6 సిక్స్‌లు బాదాడు. ఆ ఓవ‌ర్‌లో తొలి బంతిని లాంగ్ ఆఫ్ మీద‌గా సిక్స్ బాదిన ప్రియాంష్‌.. రెండవ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశ‌గా స్టాండ్స్‌లోకి పంపించాడు. ఆ త‌ర్వాతి నాలుగు బంతుల‌ను కూడా ఆర్య సిక్స‌ర్ల‌గా మ‌లిచాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలో ఓ అరుదైన రికార్డును ప్రియంష్ ఆర్య త‌న పేరిట లిఖించుకున్నాడు. ఓకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు బాదిన మూడో భార‌త క్రికెట‌ర్‌గా ప్రియాంష్ నిలిచాడు. అంత‌కుముందు ర‌విశాస్త్రి, యువ‌రాజ్ సింగ్ ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు బాదారు.

ఇక ఈ మ్యాచ్‌లో ప్రియాంష్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య‌.. 10 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో 120 ప‌రుగులు సాధించాడు. అత‌డితో పాటు మ‌రో ఢిల్లీ సూప‌ర్ స్టార్జ్ ఆట‌గాడు ఆయూష్ బదోనీ కూడా భారీ సెంచ‌రీతో మెరిశాడు.

 కేవ‌లం 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్స్‌ల‌తో 165 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ల ఫ‌లితంగా సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 308 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.
చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన స‌ఫారీ క్రికెట‌ర్‌

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)