Breaking News

బ్యాట్‌తో కొట్టబోయిన పృథ్వీ షా.. కట్‌ చేస్తే! ఊహించని షాక్‌?

Published on Thu, 10/09/2025 - 17:57

మహారాష్ట్ర - ముంబై మధ్య జరిగిన రంజీ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు పృథ్వీ షా, ముషీర్ ఖాన్‌లు గొడవపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన పృథ్వీ షా(181).. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముషీర్ వికెట్ తీసిన తర్వాత "థాంక్యూ" అని కాస్త వ్యంగ్యంగా అన్నాడు. 

వెంటనే తన సహనాన్ని కోల్పోయిన పృథ్వీషా మైదానంలోనే ముషీర్ పైపైకి దూసుకెళ్లాడు. ముషీర్ కాలర్ పట్టుకునేందుకు షా ప్రయత్నించాడు. అంపైర్లు, ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.

అయితే ఈ సంఘటనపై ముంబై క్రికెట్ అసోసియేషన్, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు క్రికెట్ అసోసియేషన్‌లు  విచారణకు సిద్దమయ్యాయి. ఈ విషయాన్ని ఏంసీఎ కార్యదర్శి అభయ్ హడప్ ధ్రువీకరించారు. బీసీసీఐ మాజీ ఛీప్ సెలక్టర్‌, భారత క్రికెట్ దిగ్గజం దిలీప్ వెంగ్‌సర్కార్ ఇద్దరు క్రికెటర్లతో మాట్లాడనున్నారు.

గురువారం ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. వార్మాప్ మ్యాచ్‌లో ఏమి జరిగిందో ముంబై కెప్టెన్, కోచ్ , ముషీర్‌ను అడిగి తెలుసుకుంటాము. ఈ మీటింగ్‌లో మాకు ఆ సంఘటనకు సంబంధించి పూర్తి నివేదిక అందుతోంది.

మా సలహాదారుడు, భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆటగాళ్లతో మాట్లాడుతారు అని అభయ్ హడప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కమలేష్ పిసల్ సైతం స్పందించారు.

ఈ సంఘటనపై రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. మేము పృథ్వీ షా, ముషీర్ ఖాన్‌తో మాట్లాడుతాము. ఆటగాళ్లలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినట్లు రుజువైతే పృథ్వీషా కచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని  కమలేష్ పిసల్  వెల్లడించారు.

కాగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో విబేధాల కారణంగా పృథ్వీ షా తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. రాబోయే రంజీ సీజన్‌లో మహారాష్ట్ర తరపున షా ఆడనున్నాడు. ఒకవేళ అతడిపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటే ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: అభిషేక్ గొప్ప ప్లేయ‌రేమి కాదు.. 3 బంతుల్లో ఔట్ చేస్తా! పాక్ బౌల‌ర్ ఓవరాక్షన్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు