Breaking News

పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇ​క గుడ్‌ బై?

Published on Mon, 06/23/2025 - 14:11

టీమిండియా ఓపెనర్‌, ముంబై స్టార్ ప్లేయర్ పృథ్వీ షా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇకపై ముంబైకి ఆడకూడదని పృథ్వీ షా నిశ్చయించుకున్నాడు. వేరే జట్టుకు మారేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)ను అతడు అభ్యర్ధించాడు.

ఈ విషయాన్నిఎంసీఎ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. "పృథ్వీ షా.. ఎంసీఎ నుంచి  నుంచి ఎన్‌వోసీ కోరాడు. మేము త్వరలో దానిపై నిర్ణయం తీసుకుంటాము" అని సదరు అధికారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. 

కాగా కెరీర్ ఆరంభంలో జూనియర్‌ సచిన్ టెండూల్కర్ పేరొందిన పృథ్వీ షా..  ఆ తర్వాత పేలవ ఫామ్‌, ఫిట్‌నెస్ స‌మస్య‌ల‌తో భారత జట్టులో చోటు కోల్పోయాడు. భారత జట్టుకు దూరంగా ఉన్నప్పటికి దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో భాగమయ్యేవాడు. ఈ సారి ఐపీఎల్‌లో ఆడే అవకాశం కూడా అతడికి రాలేదు. 

ఎంసీఎతో విభేదాలు..
కాగా గత కొంత కాలం నుంచి ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో అతడికి విబేధాలు తలెత్తాయి. అందుకు ప్రధాన కారణం అతడిని జట్టు నుంచి తప్పించడమే. ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతో గతేడాది రంజీ ట్రోఫీ జట్టు నుంచి అతడిని ముంబై సెలక్టర్లు పక్కన పెట్టారు. షా శరీరంలో అధికంగా ఫ్యాట్‌ ఉందని, బరువు ఎక్కువగా ఉన్నాడని ముంబై టీమ్‌ మెనెజ్‌మెంట్‌ సెలక్టర్లకు ఫిర్యాదు చేసింది.

టీమ్‌ మెనెజ్‌మెంట్‌ ఫిర్యాదు మెరకు అతడికి రెండు వారాల ప్రత్యేక ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ఎంసీఎ సిఫార్సు చేసింది.  కానీ సెలక్టర్లు ఆశించినంత ఫిట్‌నెస్‌ను షా సాధించలేకపోయాడు. దీంతో గతేడాది డిసెంబర్‌లో జరిగిన విజయ్‌ హాజారే ట్రోఫీలో కూడా షా భాగం కాలేదు.

ఈ క్రమంలోనే ఎంసీఎతో పృథ్వీషా తెగదింపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. పృథ్వీ షా ఇప్పటివరకు ముంబై జట్టు తరపున 58 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 4556 పరుగులు చేశాడు. అదేవిధంగా 65 లిస్ట్‌-ఎ, 117 టీ20ల్లో ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: IND vs ENG: రెచ్చగొట్టిన మహ్మద్ సిరాజ్‌.. ఇచ్చిపడేసిన ఇంగ్లండ్ బ్యాటర్‌! వీడియో

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)