Breaking News

IPL 2024- SRH: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా అతడే!

Published on Tue, 02/13/2024 - 15:00

ఐపీఎల్‌ ఎడిషన్లు మారుతున్నా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రాత మాత్రం మారడం లేదు. 2016లో తొలిసారి టైటిల్‌ను ముద్దాడిన రైజర్స్‌.. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గత కొన్ని సీజన్లుగా మరీ పేలవంగా ఆడుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతోంది.

జట్టును చాంపియన్‌గా నిలిపిన ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ను తప్పించిన తర్వాత.. న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌కు పగ్గాలు అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. కేన్‌ మామకూ ఉద్వాసన పలికి సౌతాఫ్రికా స్టార్‌ ఐడెన్‌ మార్క్రమ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో రైజర్స్‌ ఐపీఎల్‌-2023 సీజన్లో మరీ దారుణంగా పద్నాలుగింట 4 మాత్రమే గెలిచి అట్టడుగున నిలిచింది.

ఈ నేపథ్యంలో.. ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందే కెప్టెన్‌ వేటలో పడ్డ సన్‌రైజర్స్‌ యాజమాన్యం మినీ వేలంలో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆసీస్‌ను జగజ్జేతగా నిలిపిన ఈ పేస్‌ బౌలర్‌ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది.

ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తమ కెప్టెన్‌గా కమిన్స్‌ను నియమించడం ఖాయమని సన్‌రైజర్స్‌ ఫ్రాంఛైజీ చెప్పకనే చెప్పిందని అభిమానులు భావిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ కూడా ఇదే మాట అంటున్నాడు.

‘‘ప్యాట్‌ కమిన్స్‌ను కొనుగోలు చేయడం ఎస్‌ఆర్‌హెచ్‌ తెలివైన నిర్ణయం. అయితే, అతడి కోసం కాస్త ఎక్కువగానే ఖర్చుపెట్టిన మాట వాస్తవమే. కానీ.. సన్‌రైజర్స్‌కు నాయకుడి అవసరం ఉంది.

గత కొన్నేళ్లుగా ఆ వెలితితో జట్టు సమస్య ఎదుర్కొంటోంది. గత సీజన్‌లో చెత్త కెప్టెన్సీ కారణంగా భారీ మూల్యమే చెల్లించారు. ఈసారి ప్యాట్‌ కమిన్స్‌ రూపంలో వారికి మంచి ఆటగాడు దొరికాడు. కచ్చితంగా అతడినే కెప్టెన్‌గా నియమిస్తారు. సారథిగా తను తప్పక ప్రభావం చూపుతాడు’’ అని సునిల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)