Breaking News

జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే.. కట్‌చేస్తే.. 52 పరుగులకే ఆలౌట్‌!

Published on Tue, 01/23/2024 - 08:16

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో ప్రిటోరియా క్యాపిటల్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాది సీజన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ నాలుగో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్‌ జార్జ్‌ పార్క్‌ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్‌ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ ఘోర ప్రదర్శన కనబరిచింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ పేసర్లు నిప్పులు చేరగడంతో ప్రిటోరియా 13.3 ఓవర్లలో కేవలం 52 పరుగులకే కుప్పకూలింది. క్యాపిటల్స్‌ బ్యాటర్లలో ఓపెనర్లు విల్‌ జాక్స్‌(12), సాల్ట్‌(10) మినహా మిగితా ప్లేయర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. 

సన్‌రైజర్స్ బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మాన్ 4 వికెట్లతో క్యాపిటల్స్‌ పతనాన్ని శాసించగా.. వారెల్‌ మూడు, మార్కో జానెసన్‌ రెండు వికెట్లు సాధించారు. అయితే జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రిటోరియా 52 పరుగులకే ఆలౌట్‌ కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

క్యాపిటల్స్‌ జట్టులో ఫిల్‌ సాల్ట్‌, విల్‌ జాక్స్‌, రూసో, నీషమ్‌ వంటి డేంజరస్‌ ఆటగాళ్లు ఉన్నారు. కాగా 52 పరుగులకే ఆలౌటైన ప్రిటోరియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా ప్రిటోరియా నిలిచింది. 

6.5 ఓవర్లలోనే..
53 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌.. 6. 5 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది. దీంతో సన్‌రైజర్స్‌ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని ప్రిటోరియా చవిచూసింది. 
చదవండిIND vs ENG: వారిద్దరూ కాదు.. కోహ్లి స్ధానంలో ఎవరూ ఊహించని ఆటగాడు!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)